ఆటో, ట్రాక్టర్ ఢీ…ఒకరి మృతి

కామారెడ్డి: బస్వన్నపల్లి ఆర్గొండ గ్రామాల మధ్య ఆటో, ట్రాక్టర్ ఢీకొని అక్కడికక్కడే ఒకరు మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయైన సంఘటన రాజంపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆర్గొండ నుండి బసన్నపల్లి వెళ్తున్న ట్రాక్టర్ కామారెడ్డి నుండి గుండారం వెళ్తున్న ఆటోను ఢీకొనగా అక్కడికక్కడే గుగ్లోత్ వినోద్‌కుమార్ (25) మృతిచెందగా, మరో ఇద్దరు గగ్లోత్ యశోద (38), పెంటి తీవ్రగాయాలయ్యాయి. మరొకరికి స్వల్పగాయాలు కాగా వెంటనే కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం పరిస్థితి […]

కామారెడ్డి: బస్వన్నపల్లి ఆర్గొండ గ్రామాల మధ్య ఆటో, ట్రాక్టర్ ఢీకొని అక్కడికక్కడే ఒకరు మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయైన సంఘటన రాజంపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆర్గొండ నుండి బసన్నపల్లి వెళ్తున్న ట్రాక్టర్ కామారెడ్డి నుండి గుండారం వెళ్తున్న ఆటోను ఢీకొనగా అక్కడికక్కడే గుగ్లోత్ వినోద్‌కుమార్ (25) మృతిచెందగా, మరో ఇద్దరు గగ్లోత్ యశోద (38), పెంటి తీవ్రగాయాలయ్యాయి. మరొకరికి స్వల్పగాయాలు కాగా వెంటనే కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. కూలి పనుల కోసం వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని తండావాసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ రవిగౌడ్ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని కామారెడ్డి ఏరియా దవాఖానకి తరలించారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలిపారు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గుండారం తాండావాసులు పెద్ద ఎత్తున కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకి తరలివచ్చి పోస్టుమార్టం చేయకుండా అడ్డుకున్నారు. ట్రాక్టర్ యాజమాని వచ్చి తమతో మాట్లాడేంత వరకు పోస్టుమార్టం చేయోద్దని మొండికి వేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి నచ్చ చెప్పి పోస్టుమార్టం నిర్వహించారు.

కాంట్రాక్టర్ల నిర్లక్షంతో నిండు ప్రాణం బలి:
రోడ్డుపై కంకర వల్లనే ఈ ప్రమాదం జరిగిందని తాండ వాసులు మండిపడ్డారు. రోడ్డుపై కంకర వేసి ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగిందని రోడ్డు బాగుంటే ప్రమాదం జరిగేది కాదని, తాండ వాసులు కాంట్రాక్టర్‌పై మండిపడ్డారు. ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్ కంకర రోడ్డుపై రెండు వాహనాలు ఎదురెదురుగా వస్తు అదుపుతప్పి ఢీకొన్నాయని బాధితుల కుటుంబ సభ్యులు వెంటనే బాధిత కుటుంబాకు న్యాయం చేయాలని డిమండ్ చేశారు.

Comments

comments

Related Stories: