ఆటోలో పుట్టిన శిశువు మృతి

Baby-dies

ఆదిలాబాద్: గాదిగూడ సమీప వాగు వద్ద ఆటోలో జన్మించిన పసికందు దుర్మరణం చెందింది. నాలుగు రోజుల క్రితం గాదిగూడ ఆస్పత్రికికి వెళ్తుండగా ఆటోలోనే మహిళ ప్రసవించింది. రూపాపూర్‌కు చెందిన రవిత వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఆస్పత్రికి వెళ్లకేపోయింది. ఆటోలో ప్రసవం తరువాత పసికందును గాదిగూడ ఆస్పత్రికి తరలించారు. గాదిగూడ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బుధవారం ఉదయం శిశువు మృత్యువాతపడింది.