ఆటాడుకున్న భారత్

In Hockey, India won sri Lanka 20-0

హాకీలో శ్రీలంకపై  20- 0 తేడతో గెలుపు

ఆసియా క్రీడల హాకీలో భారత పురుషుల జట్టు మరో భారీ విజయం నమోదు చేసింది. మంగళవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 200 గోల్స్ తేడాతో శ్రీలంకను చిత్తు చిత్తుగా ఓడించింది. ప్రారంభం నుంచే భారత్ చెలరేగి ఆడింది. వరుస గోల్స్‌తో లంకను బెంబేలెత్తించింది. దూకుడుగా ఆడుతూ గోల్స్ సునామీ సృష్టించింది. భారత జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగి పోవడంతో లంక దిక్కు తోచని స్థితిలో పడిపోయింది. ఆకాశ్ దీప్ ఏకంగా ఆరు గోల్స్ సాధించాడు. డబుల్ హ్యాట్రిక్‌తో లంకను ఓ ఆట ఆడించాడు. హర్మన్‌ప్రీత్ సింగ్, రూపిందర్‌పాల్ సింగ్ మూడేసి గోల్స్ చేశారు. ఉపాధ్యాయ రెండు గోల్స్ నమోదు చేశాడు. ఇది భారత్‌కు వరుసగా ఐదో విజయం కావడం విశేషం. ఇప్పటికే సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకున్న భారత్ నాకౌట్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. లీగ్ దశలో దక్షిణ కొరియా, జపాన్ వంటి బలమైన జట్లపై సైతం భారీ విజయాలు సాధించింది.

Comments

comments