ఆగస్టు 2 నుంచి కొత్త గ్రామపంచాయతీలు : జూపల్లి

హైదరాబాద్ : ఆగస్టు 2వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయతీలు అమల్లోకి వస్తాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. సోమవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. పరిపాలన సౌలభ్యం కోసం సిఎం కెసిఆర్ కొత్త గ్రామపంచాయతీలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు. తెలంగాణలో కొత్తగా 9355 జూనియర్ గ్రామ పంచాయతీ కార్యదర్శులను నియమిస్తామని ఆయన చెప్పారు. కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటుతో తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొందని ఆయన […]

హైదరాబాద్ : ఆగస్టు 2వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయతీలు అమల్లోకి వస్తాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. సోమవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. పరిపాలన సౌలభ్యం కోసం సిఎం కెసిఆర్ కొత్త గ్రామపంచాయతీలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు. తెలంగాణలో కొత్తగా 9355 జూనియర్ గ్రామ పంచాయతీ కార్యదర్శులను నియమిస్తామని ఆయన చెప్పారు. కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటుతో తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొందని ఆయన పేర్కొన్నారు. గ్రామపంచాయతీల ఏర్పాటులో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని గ్రామపంచాయతీల కోసం రూ.1132 కోట్ల నిధులు ఇస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీలో నర్సరీలు ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. గ్రామపంచాయతీ మ్యాప్ గ్రామపంచాయతీ వద్ద ఉండాలని సూచించారు. గ్రామ పంచాయతీల నిర్వహణకు అవసరమైన సామగ్రి, రికార్డులను ఏర్పాటు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

New Grama Panchayats Start from August 2nd : Jupally

Comments

comments

Related Stories: