ఆగని పతనం

Rupee touches fresh low of 70.90 to a dollar

70.90కి క్షీణించిన డాలర్‌తో రూపాయి విలువ 

న్యూఢిల్లీ: రూపాయి రోజు రోజుకీ మరింతగా క్షీణిస్తూ వస్తోంది. గురువారం ట్రేడింగ్‌లో ప్రారంభంలోనే 10 పైసలు పతనమై 70.69కు చేరింది. ఓ దశలో 70.90 స్థాయికి చేరిన జీవితకాల కనిష్టానికి చేరింది. ఈ ఏడాది ఇప్పటి వరకు రూపాయి మారకం విలువ దాదాపు 10 శాతం మేర పతనమైంది. ఇది దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. బుధవారం 49 పైసలు క్షీణించిన రూపాయి మారకం విలువ చివరకు 70.59 వద్ద ముగిసింది. గురువారం మరింతగా పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు పెరగడమే రూపాయి క్షీణితకు కారణంగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.ప్రస్తుతం బ్యారల్ క్రూడాయిల్ 69.50 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

ద్రవ్య లోటు పెరగడం కూడా ఓ రకంగా రూపాయి క్షీణితకు కార ణం అవుతోంది. ఆసియా కరన్సీలో అత్యంతగా పతన మైన కరెన్సీ భారత్ కరెన్సీనే కావడం గమనార్హం. అంత ర్జాతీయ పరిస్థితుల ప్రభావం కారణంగా ముందు ముం దు ఇది మరింత క్షీణించే అవకాశం ఉందని ఆర్థిక నిపు ణులు అంచనావేస్తున్నారు. అయితే 2013లో రూపా యి విలువ క్షీణితను కట్టడి చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. విదేశీ మారక నిల్వల కింద ఉన్న డాలర్‌ను విక్రయించడం ద్వారా రిజర్వు బ్యాంక్ రూపాయిని బలోపేతం చేసింది. సెప్టెంబర్‌లో అమెరికా ఫెడరల్ బ్యాంకు కీలక వడ్డీరేట్లను పెంచనుందనే సంకే తాలతో రూపాయి మరింత డీలాపడే అవకాశ ముందని అంచనావేస్తున్నారు.