ఆకు పచ్చని తెలంగాణే ధ్యేయం

Everyone should practice planting

ప్రజలకు జీవనాధారం మొక్కలే
ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడం అలవాటు చేసుకోవాలి
కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ

మంత్రి ఈటల రాజేందర్

మనతెలంగాణ/హుజూరాబాద్: రాబోయే భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని హరితవనం గా మార్చి ఆకుపచ్చని తెలంగాణగా చూపించడం ప్రభు త్వం లక్షంగా పెట్టుకుందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం పట్టణంలోని ఆర్‌టిసి బస్టాండ్‌లో ఆర్ టిసి అధికారుల ఆధ్వర్యంలో నాల్గో విడుత హరితహార కా ర్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు.ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. సమస్త ప్రాణకోటి మనుగడకు మొక్కలే జీవనాధారమని తెలిపారు.
మొక్కలను నాటడం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. ఇంటి పరిసరాల్లో ఆవరణల్లో విధిగా మొక్కలను నాటి కాలుష్యాన్ని నివారించాలని ప్రజలకు పిలుపునిచ్చా రు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహార కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తుందని తెలిపారు. హరితహార కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయడమే లక్షంగా పెట్టుకున్నామన్నారు.అనంతరం ప ట్టణంలోని హుజూరాబాద్ ఆటో డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్స్ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. అనంతరం ఆటో డ్రైవర్ల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్,కౌన్సిలర్లు అపరాజ ముత్యంరాజు, చింత శ్రీనివాస్, చెట్టి శ్రీనివాస్, బీమగోని సురేష్, నాయకు లు తాళ్లపల్లి శ్రీనివాస్, పంజాల రాంశంకర్‌గౌడ్‌తో పాటు అధికారులు ధరమ్‌సింగ్,నల్లా వెంకట్‌రెడ్డి, బోయపాటి చె న్నయ్య తదితరులున్నారు.