ఆకలి మరణాలు లేని తెలంగాణే ప్రభుత్వ ధ్యేయం

రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి పౌష్టికాహారం అందాలి విజిలెన్స్ కమిటీలను పటిష్టం చేయండి ఆహారభద్రతా చట్టానికి తూట్లు పొడిస్తే సహించేది లేదు ఆహార కమీషన్ రాష్ట్ర చైర్మన్ తిరుమలరెడ్డి మన తెలంగాణ/మహబూబ్‌నగర్ : ఆకలి చావులేని బంగారు తెలంగాణే లక్షంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని అందుకనుగుణంగా అధికార సిబ్బంది కూడా ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలని ఆహార కమీషన్ రాష్ట్ర చైర్మన్ తిరుమలరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయలోని రెవెన్యూ సమావేశ మందిరంలో […]

రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి పౌష్టికాహారం అందాలి
విజిలెన్స్ కమిటీలను పటిష్టం చేయండి
ఆహారభద్రతా చట్టానికి తూట్లు పొడిస్తే సహించేది లేదు
ఆహార కమీషన్ రాష్ట్ర చైర్మన్ తిరుమలరెడ్డి

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ : ఆకలి చావులేని బంగారు తెలంగాణే లక్షంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని అందుకనుగుణంగా అధికార సిబ్బంది కూడా ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలని ఆహార కమీషన్ రాష్ట్ర చైర్మన్ తిరుమలరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయలోని రెవెన్యూ సమావేశ మందిరంలో అధికారులతో ఆహార భద్రత చట్టంపై సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా తిరుమలరెడ్డి  మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా రోజుకు మూడు వేల మంది పసిపిల్లలు పౌష్టికాహార లోపంతో మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆకలి చావుల్లో ప్రపంచంలోనే మన దేశం 119వ దేశంగా ఉండడం విచారించదగ్గ విషయమని తెలిపారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ప్రకారం దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంటుందని ఎవ్వరూ ఆకలిచావులతో మరణించకూడదనేదే రాజ్యాంగం చేప్పే సూత్రమని పేర్కొన్నారు. అయితే కొన్ని లోప భూయిష్ట కారణాల వల్ల దేశంలో అన్ని వనరులు ఉన్నా ఆకలి చావులు చరగడం దురదృష్టకరమన్నారు. కరువు వచ్చిన సమయంలో ఆహారం లేక ప్రజలు అల్లాడుతుంటే గోదాముల్లో ఆహార ధాన్యాలు నిలువ ఉండడంపై స్పందించిన సుప్రీంకోర్టు కేం ద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిందన్నారు. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2013లో ఆహార భద్రత చట్టాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. ఈ చట్టం ప్రకా రం దేశంలో జీవించే ప్రతి ఒక్కరూ పౌష్టికాహారంతో జీవించాలన్నదే లక్షంగా ఈ చట్టాలను రూపొందించారని పేర్కొన్నారు. అందులో భాగంగానే సబ్సిడీపై పేదలకు  బియ్యం ఇతర ఆహార వస్తువులను సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత నకిలీ కార్డులను తొలగించేందుకు వేలిముద్రల ఈ పాస్ విధానాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఈ పద్దతి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల బోగస్ కార్డులు తొలగించినట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలో దాదాపు 15 వేల మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారని వారందరికి రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఎవరికి కూడా వేలిముద్రలు పడలేదంటూ బియ్యం ఇవ్వకుండా చేయవద్దని సూచించారు. అర్హులా కాదా గుర్తించి పేదలకు న్యా యం చేయాలని సూచించారు. అధికారులు పేదలను ఒక్కసారి గుర్తు చేసుకుని వారి సాదక బాదకాలపై స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా అంగన్‌వాడీ కేంద్రాల్లోను మధ్యహ్న భోజన పథకంలోను నాణ్యమైన పౌష్టికారాన్ని అందించాలని ఆదేశించారు. ఆహార భద్రత చట్టం అమలు పరిచేందుకు విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలను పటిష్టం చేయాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రజల భాగస్వామ్యంలో విజిలేన్స్ కమిటీలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఆహార కమీషన్ రాష్ట్ర సభ్యురాలు శారద మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ద్వారా జీవించే హక్కును, కాలరాసే హక్కును ఎవరికి లేదని తెలిపారు. అందులో భాగంగానే ప్రభుత్వం ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చిందని ఈ చట్టం ప్రకారం ప్రతి ఒక్క రూ పౌష్టికాహారంతో జీవించాలని ఆకాంక్షించారు. ఆకలి మరణాలు లేని తెలంగాణ రావాలంటే ఆహార భద్రత చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. కమీషన్ పనిచేసేదే ప్రజల కోసమని, అధికారులు ప్రజల కోసం పని చేయాలని సూచించారు. ఆహార భద్రత విషయాల్లో ఫిర్యాదు వస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో డిఆర్‌ఒ వెంకటేశ్వర్లు, ఆర్‌డిఒ లక్ష్మీనారాయణ, ఐసిడిఎస్ పిడి వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related Stories: