ఆందోళనలు

మండల కార్యాలయం వద్ద సిపిఐ ఆందోళన కలెక్టరేట్ల ఎదుట టిజెఎస్ దీక్ష పంచాయతీ కార్మాకుల సమ్మె ప్రారంభం  జిల్లాలో జిల్లా కలెక్టర్, మండల తహశీల్దార్ కార్యాలయాల వద్ద సోమవారం ఆందోళనలు జరిగాయి. రైతుబంధు పథకంలో భాగంగా పాస్‌పుస్తకాలు, రైతు బంధు చెక్కులను ఇవ్వని రైతులకు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జన సమితి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం కలెక్టరేట్ ఎదుట గల ధర్నాచౌక్‌లో ధర్నా నిర్వహించింది. కొత్తగూడెం తెలంగాణ జన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు […]

మండల కార్యాలయం వద్ద సిపిఐ ఆందోళన
కలెక్టరేట్ల ఎదుట టిజెఎస్ దీక్ష
పంచాయతీ కార్మాకుల సమ్మె ప్రారంభం 

జిల్లాలో జిల్లా కలెక్టర్, మండల తహశీల్దార్ కార్యాలయాల వద్ద సోమవారం ఆందోళనలు జరిగాయి. రైతుబంధు పథకంలో భాగంగా పాస్‌పుస్తకాలు, రైతు బంధు చెక్కులను ఇవ్వని రైతులకు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జన సమితి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం కలెక్టరేట్ ఎదుట గల ధర్నాచౌక్‌లో ధర్నా నిర్వహించింది. కొత్తగూడెం తెలంగాణ జన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ప్రో॥ కోదండరాం పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలని, స్థానిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి ఖమ్మంజిల్లాలో సిపిఐ ఆందోళనలు నిర్వహించింది. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఇరు జిల్లాల కార్యదర్శులు బాగం హేమంతరావు, ఎస్‌కె సాబీర్‌పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోటు ప్రసాద్, బి.అయోధ్య, రావులపల్లి రాంప్రసాద్ తదితరులు ఉన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేటి నుంచి సమ్మె ప్రారంభించిన పంచాయతీ కార్మికులు కొత్తగూడెంలో దీక్షలు చేపట్టగా ఖమ్మంలో ప్రదర్శన నిర్వహించి సదస్సు నిర్వహించారు. ఏఐటియుసి, సిఐటియు, ఇప్టు, ఐఎన్‌టియు తదితర కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: