అసెంబ్లీ రద్దు పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

హైదరాబాద్: అసెంబ్లీ రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ పిటిషన్‌లో రాజ్యాంగం, చట్టాలు ఉల్లంఘించినట్లు  కన్పించడంలేదని తెలిపింది. రాజ్యాంగం, చట్టాల ఉల్లంఘన జరగనప్పుడు తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పషం చేసింది. అసెంబ్లీ రద్దు సవాల్ చేస్తూ న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. ప్రజా బలం లేక రాజ్యాంగబద్ధ సంస్థలపై కాంగ్రెస్ పార్టీ బురద జల్లుతుందని టిఆర్‌ఎస్ నాయకులు విమర్శించారు. అనేక అంశాల్లో కోర్టు ఎన్ని సార్లు చీవాట్లు పెట్టినా విపక్షాలకు […]

హైదరాబాద్: అసెంబ్లీ రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ పిటిషన్‌లో రాజ్యాంగం, చట్టాలు ఉల్లంఘించినట్లు  కన్పించడంలేదని తెలిపింది. రాజ్యాంగం, చట్టాల ఉల్లంఘన జరగనప్పుడు తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పషం చేసింది. అసెంబ్లీ రద్దు సవాల్ చేస్తూ న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. ప్రజా బలం లేక రాజ్యాంగబద్ధ సంస్థలపై కాంగ్రెస్ పార్టీ బురద జల్లుతుందని టిఆర్‌ఎస్ నాయకులు విమర్శించారు. అనేక అంశాల్లో కోర్టు ఎన్ని సార్లు చీవాట్లు పెట్టినా విపక్షాలకు బుద్ధిరావడం లేదన్నారు. పలు సందర్భాల్లో ఎన్నికల కమిషన్‌పై కూడా విపక్షాలు అనుచిత వ్యాఖ్యలు చేశాయని మండిపడ్డారు.