అసత్యప్రచారాలను కార్మికులు నమ్మొద్దు

పాల్వంచ :  విద్యుత్ రంగంలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ కార్మికుల క్రమబద్దీకరణ విషయంలో జరుగుతున్న అసత్య ప్రచారాలను కార్మికులు నొమ్మదన్ని ఏఐటియుసి అను బంధ తెలంగాణ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూని యన్, హెచ్-64 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. దుర్గా అశోక్ యూనియన్ సలహాదారులు యస్‌కె సాబీర్‌పాషా అన్నారు. కెటిపియస్ ఏఐటియుసి రీజనల్ కార్యాలయం లో యస్. పరమేష్, బి. శంకర్‌ల అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో సాబీర్‌పాషా, దుర్గా అశోక్‌లు మాట్లాడుతూ.. […]

పాల్వంచ :  విద్యుత్ రంగంలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ కార్మికుల క్రమబద్దీకరణ విషయంలో జరుగుతున్న అసత్య ప్రచారాలను కార్మికులు నొమ్మదన్ని ఏఐటియుసి అను బంధ తెలంగాణ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూని యన్, హెచ్-64 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. దుర్గా అశోక్ యూనియన్ సలహాదారులు యస్‌కె సాబీర్‌పాషా అన్నారు. కెటిపియస్ ఏఐటియుసి రీజనల్ కార్యాలయం లో యస్. పరమేష్, బి. శంకర్‌ల అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో సాబీర్‌పాషా, దుర్గా అశోక్‌లు మాట్లాడుతూ..

విద్యుత్ రంగంలో కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్దీకరణ కోసం కార్మిక సంఘాలన్నీ ఏకమై పోరాటం చేసిన నేపధ్యంలో ముఖ్యమంత్రి విద్యుత్ రంగం దాని ప్రాముఖ్యత, గత హీమలను దృష్టిలో ఉంచుకొని అందరికీ ఆమోదయోగ్యమైన ప్రకటన చేయటం జరిగిందన్నారు. కొందరు స్వార్థపరులు విధివిదానాలు ఖరారు కాకముందే అసత్య ప్రచారాలు చేస్తూ కార్మిక వర్గాన్ని గందరగోళంలోకి నెట్టివేస్తున్నారన్నారు. అటువంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. యూనియన్‌రాష్ట్ర నాయకత్వం ఇటీవల జెన్కో సియండి డి. ప్రభాకర్‌రావును కలవగా వారుకూడా ఈ క్రమబద్దీకరణకు కార్మిక సంఘాలన్నీ సహకరించాలని, నిబంధనలకు విరుద్దంగా కొందరు కార్మికులను దోపిడీ చేయడానికి చూస్తున్నారని అటువంటి వారి ఉచ్చులో కార్మికులు పడొద్దని, క్రమబద్దీకరణ న్యాయబద్దంగా జరిగేందుకు సహకరించాలని కోరారన్నారు.

ఈసమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఐటియుసి అధ్యక్ష కార్యదర్శులు నరాటి ప్రసాద్, గుత్తుల సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు బండి నాగేశ్వరరావు, ఏఐటియుసి జిల్లా కౌన్సిల్ సభ్యులు కె. ఆదాం, యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు పరమేష్, చెరుకు అశోక్, సత్యనారాయణ, సురేష్, కృష్ణారావు, శివసాంబమూర్తి, జి. రవి, సంసుద్దీన్, కాంట్రాక్ట్ విభాగం
నాయకులు బి. శంకర్, వైఆర్‌సి రెడ్డి, బీక్యా, మంగ, గణపతి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: