అవును, అంట్లు తోముతాం…తప్పేంటి?

మంత్రి కెటిఆర్‌పై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన ‘డిష్ వాషర్’ వ్యాఖ్యకు ట్విట్టర్‌లో తీవ్రంగా స్పందించిన ఎన్‌ఆర్‌ఐలు, అభిమానులు పిసిసి చీఫ్‌ది శ్రమను, శ్రామికులను తక్కువగా చూసే తత్వమని వ్యాఖ్య మన తెలంగాణ / హైదరాబాద్ : శ్రమ జీవనాన్ని చిన్నచూపు చూసేలా తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మంత్రి కెటిఆర్‌ను ఉద్దేశిస్తూ చేసిన వ్యంగ్య వ్యాఖ్యల పట్ల ట్విట్టర్ వేదికగా ఎన్‌ఆర్‌ఐలు ఉత్తమ్‌పై విరుచుకుపడుతున్నారు. కెటిఆర్‌కు మద్దతుగా నిలిచారు. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి […]

మంత్రి కెటిఆర్‌పై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన ‘డిష్ వాషర్’ వ్యాఖ్యకు ట్విట్టర్‌లో తీవ్రంగా స్పందించిన ఎన్‌ఆర్‌ఐలు, అభిమానులు
పిసిసి చీఫ్‌ది శ్రమను, శ్రామికులను తక్కువగా చూసే తత్వమని వ్యాఖ్య

మన తెలంగాణ / హైదరాబాద్ : శ్రమ జీవనాన్ని చిన్నచూపు చూసేలా తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మంత్రి కెటిఆర్‌ను ఉద్దేశిస్తూ చేసిన వ్యంగ్య వ్యాఖ్యల పట్ల ట్విట్టర్ వేదికగా ఎన్‌ఆర్‌ఐలు ఉత్తమ్‌పై విరుచుకుపడుతున్నారు. కెటిఆర్‌కు మద్దతుగా నిలిచారు. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రమైక జీవన సౌందర్యానికున్న ప్రాధాన్యతను, నగ్నసత్యాన్ని తెలుసుకోలేక అదుపు తప్పి చేసిన వ్యాఖ్యలతో సెల్ఫ్‌గోల్ వేసుకున్నారు. ట్వట్టర్‌లో ‘ట్రోల్’ అయిపోతున్నారు. మంత్రి కెటిఆర్ రాజకీయాల్లోకి రాకముందు అమెరికాలో గిన్నెలు కడిగేవాడంటూ ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వెల్లువెత్తుతోంది. శ్రమను, శ్రమజీవులను, గృహిణులను ఉత్తమ్ కించపరిచారని మండిపడుతున్నారు.

ఐయామ్ డిష్ వాషర్& సో వాట్ :
‘ఐయామ్ డిష్‌వాషర్’, ‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’ హ్యాష్ ట్యాగ్‌లతో కెటిఆర్‌కు మద్దతు పలుకుతూ ఎన్‌ఆర్‌ఐలు, కెటిఆర్ అభిమానులు పోస్టులతో ట్విట్టర్‌ను హోరెత్తిస్తున్నారు. తాము కూడా ప్లేట్లు, గిన్నెలు కడుగుతామని, అది శ్రమైకజీవన సౌందర్యమని ఫొటోలు తీయించుకుని మరీ ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు. ఉత్తమ్‌కు కెటిఆర్ ట్విటర్లో ఇచ్చిన సమాధానాన్ని షేర్ చేసుకుంటున్నా రు. ‘అమెరికాలో ఉండే భారతీయులు వారి పనులు వారే చేసుకుంటారని.. మీ పప్పులా (రాహుల్ గాంధీ) కాకుండా.. కష్టపడి సంపాదించిన డబ్బుతో గౌరవప్రద జీవితాన్ని గడిపానని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను’ అని కెటిఆర్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తున్నారు. ఉత్తమ్‌లా జనం సొమ్మును దో చుకుని, కారులో తగలబెట్టలేదని పేర్కొన్నారు. అప్పోసప్పో చేసి అమెరికా వెళ్లి, చిన్నాచితకా పనులు చేసుకుంటూ గౌరవప్రదంగా జీవిస్తున్నామని, పనికిమాలిన రాజకీయాలు చేసి ఎవరి సొమ్మూ దోచుకోవడం లేదని వ్యాఖ్యానించారు.

ఇన్ఫో గ్లోబల్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, స్కై రెక్ ఇండియా సిఇఓ, మైక్ టివి సహ వ్యవస్థాపకులు, ఏహెచ్‌ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అయిన అప్పిరెడ్డి ‘ఐ సపోర్ట్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని ట్వీట్‌చేసి వంటింట్లో అంట్లు తోమే ఫోటోను పోస్ట్ చేశారు.
స్టార్టప్ కంపెనీ పెట్టిన సామాజిక కార్యకర్త గడ్డంపల్లి రవీందర్ ‘ఐ యామ్ ఏ డిష్ వాషర్’, ‘ఐ సపోర్ట్ డిగ్నిటీ ఆఫ్ లేబర్’ అని ట్వీట్‌చేసి ఫోటోను పోస్ట్ చేశారు.
మార్కెటింగ్ సంస్థ వ్యవస్థాపకుడైన జగన్‌రెడ్డి కూడా ‘అంట్లు తోమడంలో తప్పేంటి, నేను వాడిన అంట్లను నేనే తోముకుంటాను. ప్రగతిశీల సమాజంలో మనం నివసిస్తున్నాం. ఇందుకు గర్వపడుతు న్నాను’ అని ట్వీట్‌చేసి ఫోటోను పోస్ట్ చేశారు.
రెడ్డి’గా గుర్తింపు పొందిన వైఎస్ జగన్ వీరాభిమాని పేరం శేఖర్ రెడ్డి సైతం ‘ఐ సపోర్ట్ డిగ్నిటీ ఆఫ్ లేబర్’ అంటూ ట్వీట్‌చేసి ఫోటో ను పోస్ట్ చేశారు.
ఎంబిఏ, ఎంఎస్ చదివాను. ఇప్పుడు లండన్‌లో ఉంటున్నాను. ఒక సామాజిక కార్యకర్తను, రచయితను, వ్యాపారవ్తేను. నేను అన్నం తిన్న తర్వాత నా ప్లేట్లను నేనే కడుక్కుంటాను. నేను అర్హుడ్ని కానా?’ అంటూ యునైటెడ్ కింగ్‌డమ్ టిఆర్‌ఎస్ విభాగం కార్యదర్శి చాడ సృజన్‌రెడ్డి ట్వీట్‌చేసి ఫోటోను పోస్ట్ చేశారు.

Comments

comments

Related Stories: