అవిస్వాసానికి సహకరించాలని కోరింది టిఆర్‌ఎస్ ఎంపిటిసిలే…..

TRS, MPTC is an organization wants to cooperate with Avila
ముత్తారం: ముత్తారం ఎంపిపి అత్తె చంద్రమౌళి పనితీరు అసంతృప్తితో ఉన్నాయని అవిస్వాసానికి సహకరించాలని కోరింది టిఆర్‌ఎస్, ఎంపిటిసిలే అని ముత్తారం జెడ్పిటిసి చొప్పరి సదానందం తెలిపారు. మంగళవారం రోజున మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ 4ఏండ్ల క్రితం జరిగిన స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి 7 ఎంపిటిసి స్థానాలు రాగా, ఒక్కరు స్వతంత్ర అభ్యర్థి, ఒకరు టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపొందారన్నారు. ఎంపిపి సీటును కైవసం చేసుకోవడానికి పూర్తి మెజారిటితో ఉన్న అధికార బలంతో ఎంపిటిసిలను కొనుగోలు చేసి, మండలాధ్యక్షుడి స్థానాన్ని కైవసం చేసుకున్నారని ఆరోపించారు. రెండు రోజుల క్రితం టిఆర్‌ఎస్, ఎంపిటిసిలు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ మేం పార్టీని వీడేది లేదని, మేము నిజాయితీ పరులమని, గొప్పలు చెప్పుకోవడం సరికాదన్నారు. అంతకంటే ముందు వారు ఏపార్టీ గుర్తుపై గెలిచారో గుర్తుంచుకోవాలని హితవు పలికారు. గతంలోనే ఎంపిపి అవినీతికి పాల్పడుతున్నారని, ఎంపిటిసిలను పట్టించుకోవడంలేదని సమాచార హక్కు క్రింద అభివృద్ది పనులు నిధుల ఖర్చులపై వివరాలు అడిగింది వాస్థవం కాదా? అన్నారు. స్థానిక ఎంఎల్ఏ, ఎంపిపిలపై ఆసంతృప్తి కలిగినప్పుడు వ్యతిరేక సమావేశాలు నిర్వహిస్తూ జనరల్ బాడీ సమావేశాన్ని బహిష్కరించలేదా? అని ప్రశ్నించారు. ఎంపిపి పనితీరు సరిగ్గాలేదని, అభివృద్దికి అడ్డు పడుతున్నాడని అవిస్వాస పత్రంపై సంతకాలు చేసింది వాస్థవం కాదా? అని, ఎంపిటిసిలు సంతకం చేసిన పత్రాన్ని చూపించారు. తగినంత మెజారిటీ ఉండి కూడా కుటిల రాజకీయాలను ఛేదించలేక ఎంపిపి పదవిని కోల్పోయానని, అలాంటి వదులుకున్న పదవి కోసం వెంపర్లాడడంలేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టుపై గెలిచి కన్నతల్లి లాంటి పార్టీని వీడి, అధికారం మీద వ్యామోహంతో వెన్నుపోటు పొడిచిన మీరు నీతులు చెప్పడం, దయ్యాలు వేదాలు వళ్లించినట్లే అని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బియ్యాని శివకుమార్, సింగిల్ విండో డైరెక్టర్ మెంగని తిరుపతి, బియ్యాని రాజబాబు, రామంచ మహేందర్ పాల్గొన్నారు.

Comments

comments