అవిశ్వాసానికి ముందే చైర్‌పర్సన్ రాజీనామా

జిల్లా కలెక్టర్‌కు రాజీనామా పత్రం అందజేసిన సునీతారాణి హైకోర్టు స్టే రాకపోవడంతో పరువు కాపాడుకునేందుకు యత్నం రాజీనామా చేయాలని అధిష్టానం ఒత్తిడి ఉత్కంఠ భరితంగా సాగిన రాజకీయం   మనతెలంగాణ/మంచిర్యాల : గత కొంత కా లంగా వ్యూహాత్మకంగా జరుగుతున్న అవిశ్వాసం వ్యవహారానికి ఎట్టకేలకు తెరపడింది. బుధవారం సాయంత్రం బెల్లంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ పసుల సునీతారాణి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రా న్ని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్‌కు అందజేశారు. గురువారం అవిశ్వాస ప్రక్రియపై […]

జిల్లా కలెక్టర్‌కు రాజీనామా పత్రం అందజేసిన సునీతారాణి
హైకోర్టు స్టే రాకపోవడంతో పరువు కాపాడుకునేందుకు యత్నం
రాజీనామా చేయాలని అధిష్టానం ఒత్తిడి
ఉత్కంఠ భరితంగా సాగిన రాజకీయం  

మనతెలంగాణ/మంచిర్యాల : గత కొంత కా లంగా వ్యూహాత్మకంగా జరుగుతున్న అవిశ్వాసం వ్యవహారానికి ఎట్టకేలకు తెరపడింది. బుధవారం సాయంత్రం బెల్లంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ పసుల సునీతారాణి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రా న్ని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్‌కు అందజేశారు. గురువారం అవిశ్వాస ప్రక్రియపై అధికారులు ప్రత్యేక సమావేశం నిర్ణయించేందుకు  ఏర్పాట్లు చేయగా చివరికి చైర్‌పర్సన్ రాజీనామాచేయడం కొసమెరుపు. ఈమేరకు జిల్లా కలెక్టర్ ఆర్‌వి. కర్ణన్ చైర్‌పర్సన్ సమర్పించిన రాజీనామా పత్రం విషయాన్ని మున్సిపల్ శాఖ కమీషనర్ దృష్టికి తీసుకెళ్లారు.

వ్యక్తి గత కారణాల వల్ల రాజీనామా సమర్పిస్తున్నాని లేఖలో పేర్కొన్నారు. గురువారం చైర్‌పర్సన్‌పై కొందరు కౌన్సిలర్‌లు అవిశ్వాస తీర్మానాన్ని ప్ర వేశపెట్టగా అధికారులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. చైర్‌పర్సన్  అవిశ్వాస ప్రక్రియ నిర్వహించే అధికారం జిల్లా కలెక్టర్‌కు లేదని సవాల్ చేస్తూ కోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు. ఈమేరకు హైకోర్టులో  స్టే రాకపోవడంతో  పరువును కాపాడుకునేందుకు వ్యూహాత్మకంగా బుధవారం సాయంత్రం చైర్‌పర్సన్ రాజీనామా చేశారు.  అవిశ్వాస తీర్మానం జాయింట్ కలెక్టర్‌కు సమర్పించన రోజే  చైర్‌పర్సన్ రాజీనామా చేసి ఉంటే బాగుండేదని, గురువారం అవిశ్వాసంలో నెగ్గలేక చైర్‌పర్సన్ రాజీనామా చేసిందని అసమ్మతి కౌన్సిలర్‌లు ఆరోపిస్తున్నారు.

నాటకీయంగా మారిన అవిశ్వాసం ….
బెల్లంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ పసుల సునీతారాణిపై అధికార, విపక్ష పార్టీలకు చెందిన అసమ్మతి కౌన్సిలర్‌లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్ట గా గురువారం చైర్‌పర్సన్‌పై అవిశ్వాస సమావేశాన్ని అధికారులు స్థా నిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహిస్తుండగా తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. చైర్‌పర్సన్ సునీతారాణి వర్గీయులు అవిశ్వాస సమావేశం నిర్వహించే అధికారం జిల్లా కలెక్టర్‌కు లేదని కోర్టును ఆశ్రయించారు. ఈవిషయాన్ని జిల్లా ఉన్నతాధికారులు రాష్ట్ర పు రపాలక పరిపాలన అధికారులకు సమాచారం అం దించారు. అయినప్పటికీ అధికారులు మాత్రం అవిశ్వాసం ప్రక్రియను కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చైర్‌పర్సన్ వేసిన పిటిషన్‌పై ప్రభుత్వం తరుఫున న్యాయవాదులు వాదిస్తారని పేర్కొంటూ అ విశ్వాస సమావేశాన్ని నిర్వహించేందుకు కసరత్తులు చే స్తున్నారు. కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పా టు చేశారు. 29 మంది టిఆర్‌ఎస్, కాంగ్రెస్, సి పిఐల కు చెందిన అసమ్మతి కౌన్సిలర్‌లు రహస్య శిబిరం నుంచి నేరుగా సమావేశానికి హాజర య్యే విధంగా ఏ ర్పాట్లు చేశారు. అధికార పార్టీ కౌన్సిలర్‌లు విపక్షాల తో కలసి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టగా పార్టీ అధిష్టానంతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు అసమ్మతి కౌన్సిలర్‌లను బెదిరింపులకు గురి చేసినప్పటికి పట్టించుకోకుండా అవిశ్వాసం వైపే మొ గ్గు చూపుతున్నారు.

రచ్చకెక్కిన గ్రూపు తగాదాలు…..
బెల్లంపల్లి మున్సిపల్ రాజకీయాలు రచ్చకెక్కాయి. రా ష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా బెల్లంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ పసుల సునీతారాణిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. అధికార పార్టీ కౌన్సిలర్‌ల తో పాటు కాంగ్రె స్, బిజెపి, సిపిఐ స్వతంత్ర కౌన్సిలర్ లు ఇటీవల జాయింట్ కలెక్టర్ సురేందర్‌రావుకు తీ ర్మానం ప్రతిని అందజేశారు. గత కొన్ని రోజులుగా మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం పెట్టేందుకు ర హస్య శిబిరాలు , క్యాంపు రాజకీయాలు నడుపుతున్నప్పటికీ టిఆర్‌ఎస్ అధిష్టానం ఎందుకు పట్టించుకోవడం లేదనేది ప్రశ్నార్థకంగా మారింది. అధికార పార్టీలోనే అసమ్మతి గూ డు కట్టుకోగా విపక్ష పార్టీలకు చెందిన కౌన్సిలర్‌లు వీరి మద్దతు పొందేందుకు చేసిన ప్రయత్నాలు ఫ లించాయి.

మెజార్టీ కలిగి ఉన్న అధికార పార్టీ కౌన్సిలర్ లు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విపక్షాలతో చేతు లు కలుపడం వారికి మద్దతు తెలపడం చర్చనీయాంశంగా మారింది. బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో 34 మంది కౌన్సిలర్‌లలో టిఆర్‌ఎస్ కౌన్సిలర్‌లతో కల పి మొత్తం 29 మంది బలగం కూడకట్టుకొని రహస్య శిబిరాలు నిర్వహించడం ఆపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం విస్మయానికి గురి చేస్తుంది. అసమ్మతి కౌన్సిలర్ స్వరూపకు,మున్సిపల్ చైర్‌పర్సన్ సునీతారాణికి మధ్య గత కొంత కాలంగా వివాదాలు జరుగుతున్నాయి. ప్రతీ మున్సిపల్ సమావేశంలో గందరగోళా న్ని సృష్టించడం కుర్చీలను విరగ్గొట్టడం ఆనవాయితీ గా మారింది. మున్సిపల్ సమావేశా ల్లో పెద్ద ఎత్తున గొడవలు జరిగినప్పటికీ కూడా టిఆర్‌ఎస్ పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చైర్‌పర్సన్‌గా సునీతారాణి పదవీ బాధ్యతలు చేపట్టిన నాలుగు సం వత్సరాలు పూర్తి కాగా గత 6 నెలల కాలంగా అసమ్మతి కౌన్సిలర్‌లు అదను కోసం ఎదురుచూస్తున్నారు. దాదాపు నెల రోజులకు పైగా రహస్య ప్రాంతాల్లో క్యాంపులను నిర్వహించి 29 మంది కౌన్సిలర్‌లు చై ర్‌పర్సన్‌పై అవిశ్వాసం పెట్టేందుకు యత్నిస్తున్నప్పటికి ఎంపి, ఎంఎల్‌ఏలు , టిఆర్‌ఎస్ జిల్లా నాయకత్వం ముందస్తూ చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి.

బెదిరింపులకు తలొగ్గని అసమ్మతి కౌన్సిలర్‌లు
బెల్లంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ పసుల సునీతారాణిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంలో కీలకపాత్ర పోషించిన మునిమంద రమేష్ అనే వ్య క్తిపై కేసు నమోదు చేశారు. అంతే కాకుండా అతను సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నందు వల్ల అతనితో పా టు మరో కౌన్సిలర్ భర్తను మణుగూరుకు బదిలీ చే శారు.ఏది ఏమైనా చైర్‌పర్సన్ సునీతారాణిపై ప్రవేశపెట్టిన అవిశ్వాసాన్ని నెగ్గించుకునేందుకు అసమ్మతి కౌన్సిలర్‌లు కసరత్తులు చేస్తున్నారు.

Related Stories: