అవిశ్వాసం వైపే అసమ్మతి మొగ్గు

ముదురుతున్న చైర్‌పర్సన్ అవిశ్వాస వ్యవహారం తెలంగాణ భవన్‌లో అవిశ్వాసంపై చర్చ అధికార పార్టీ కౌన్సిలర్‌లకు ఎంపి వార్నింగ్ ఇరుకున పడ్డ బెల్లంపల్లి ఎంఎల్‌ఏ చిన్నయ్య అవిశ్వాసం పెట్టేందుకే కొనసాగుతున్న క్యాంపు రాజకీయాలు పార్టీ అధిష్టానం బుజ్జగించినా వినిపించుకోని కౌన్సిలర్‌లు  మన తెలంగాణ/ మంచిర్యాల : బెల్లంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ పసు ల సునీతరాణిపై పెట్టిన అవిశ్వాస వ్యవహారం ముదురుతోంది. అసమ్మతి కౌన్సిలర్‌లు అవిశ్వాసం పైపే మొగ్గు చూపుతున్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు కౌన్సిలర్లతో పాటు విపక్షాల […]

ముదురుతున్న చైర్‌పర్సన్ అవిశ్వాస వ్యవహారం
తెలంగాణ భవన్‌లో అవిశ్వాసంపై చర్చ
అధికార పార్టీ కౌన్సిలర్‌లకు ఎంపి వార్నింగ్
ఇరుకున పడ్డ బెల్లంపల్లి ఎంఎల్‌ఏ చిన్నయ్య
అవిశ్వాసం పెట్టేందుకే కొనసాగుతున్న క్యాంపు రాజకీయాలు
పార్టీ అధిష్టానం బుజ్జగించినా వినిపించుకోని కౌన్సిలర్‌లు 

మన తెలంగాణ/ మంచిర్యాల : బెల్లంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ పసు ల సునీతరాణిపై పెట్టిన అవిశ్వాస వ్యవహారం ముదురుతోంది. అసమ్మతి కౌన్సిలర్‌లు అవిశ్వాసం పైపే మొగ్గు చూపుతున్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు కౌన్సిలర్లతో పాటు విపక్షాల కౌన్సిలర్‌లు మొత్తం 29 మంది కౌన్సిలర్‌లు అవిశ్వాస తీర్మానాన్ని జెసి సురేందర్‌రావుకు అందజేశారు. అవిశ్వాసం వ్యవహారంలో ఇప్పటికే రాష్ట్ర అధిష్టానంతో పాటు మంత్రి కెటిఆర్ మాట్లాడి కౌన్సిలర్‌లను బుజ్జగిం చే ప్రయత్నం చేసినప్పటికి ఫలించలేదు. తాజాగా శుక్రవారం పెద్దపల్లి ఎంపి బాల్క సుమన్ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎంఎల్‌ఏ దుర్గం చిన్నయ్యతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఎంపి బాల్క సుమన్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోను చైర్‌పర్సన్‌పై ఆవిశ్వాసం పెట్టవద్దని టిఆర్‌ఎస్‌కు చెందిన కౌన్సిలర్‌లు వినిపించుకోక అసమ్మతి వైపే మొగ్గు చూపినట్లయితే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతే కాకుండా బెల్లంపల్లి ఎంఎల్‌ఏ దుర్గం చిన్నయ్య కౌన్సిలర్‌లతో సంప్రదింపులు జరిపి మరోసారి వారికి నచ్చజెప్పాలని సూచించారు. అవిశ్వాసం వ్యవహారంలో ఇప్పటికే ఎంఎల్‌ఏ చిన్నయ్యపై అధిష్టానం గుర్రుగా ఉండగా మరోసారి ఎంపి బాల్కసుమన్ కూడా ఎంఎల్‌ఏ చొరవ చూపాలని చెప్పడంతో ఇరుకున పడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా చైర్‌పర్సన్ పసుల సునీతరాణి రాజీనామా చేయాలని లేని పక్షంలో అవిశ్వాసం పెట్టక తప్పదని అసమ్మతి కౌన్సిలర్‌లు పట్టు వీడడం లేదు. బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలో 34 మంది కౌన్సిలర్‌లకు గాను 29 మంది కౌన్సిలర్‌లు అవిశ్వాస తీర్మాణంపై సంతకాలు చేశారు. అధికారికంగా ఆవిశ్వాస సమావేశం తేదీ నిర్ణయించే వరకు క్యాంపు రాజకీయలను కొనసాగించాలని నిర్ణయించారు. ఇప్పటికే గత 19 రోజులుగా అసమ్మతి కౌన్సిలర్‌లు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు అందుబాటులో లేకుండా క్యాంపు రా జకీయ శిబిరాల్లో ఉంటున్నారు. ఇదిలా ఉండగా అధికార యంత్రాంగం 29 మంది కౌన్సిలర్‌లు అందజేసిన ఆవిశ్వాసం తీర్మాణంపై ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. మంచిర్యాల కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ ఈనెల 20 వరకు సెలవులో ఉండడంతో కొమురంభీం జిల్లా కలెక్టర్‌కు ఇంఛార్జీ బాధ్యతలను అప్పగించగా ఈ వ్యవహారాన్ని కొందరు కౌన్సిలర్‌లు ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. త్వరలోనే సమావేశాన్ని ఖరారు చేసి, అవిశ్వాసం ప్రకటించిన కౌన్సిలర్‌లకు ప్రత్యేకంగా లేఖలను పంపించే అవకాశాలు ఉన్నాయి. కాగా అవిశ్వాసం ప్రకటించిన కౌన్సిలర్‌లు నేరుగా అధికారులు ఏర్పాటు చేసే అవిశ్వాస సమావేశానికి హాజరయ్యే విధంగా పలు ఏర్పాట్లు చేశారు. ఏది ఏమైనా బెల్లంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం పెట్టేందుకు అసమ్మతి కౌన్సిలర్‌లు మొగ్గు చూపుతున్నారు. అధిష్టానం ఆదేశాలను పట్టించుకోకుండా ఇప్పటికే అవిశ్వాస తీర్మాణాన్ని అధికార యంత్రాంగానికి అందజేశారు. ఈ పరిస్థితుల్లో చైర్‌పర్సన్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.

Comments

comments

Related Stories: