అవినీతి గురించి మాట్లాడుతున్నారా రాహుల్ జీ..?

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. రాహుల్‌ అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని చురకలంటించారు. రాహుల్‌ గాంధీతో పాటు వేదికపై ఉన్న వారిలో సగం మంది బెయిల్‌పై ఉన్నవారేనని మంత్రి పేర్కొన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ గురించి రాహుల్‌గాంధీ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు కెటిఆర్. ప్రజాస్వామ్య విలువలను కాలరాసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని కెటిఆర్ ఆరోపణలు గుప్పించారు. ”కాంగ్రెస్ […]

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. రాహుల్‌ అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని చురకలంటించారు. రాహుల్‌ గాంధీతో పాటు వేదికపై ఉన్న వారిలో సగం మంది బెయిల్‌పై ఉన్నవారేనని మంత్రి పేర్కొన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ గురించి రాహుల్‌గాంధీ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు కెటిఆర్. ప్రజాస్వామ్య విలువలను కాలరాసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని కెటిఆర్ ఆరోపణలు గుప్పించారు. ”కాంగ్రెస్ పార్టీ కాస్త స్కాంగ్రెస్” పార్టీగా మారిందని  ఎద్దేవా చేశారు. ఎ అంటే ఆదర్శ్, బి అంటే బోఫోర్స్, సి అంటే కామన్వెల్త్.. ఇంకా.. మీ కుంభకోణాల గురించి చెప్పాలా రాహుల్ అని కెటిఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. భారతదేశంలో ఎమర్జెన్సీ ఒకే ఒక్కసారి విధించిన విషయాన్నిస్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాహుల్‌గాంధీకి గుర్తు చేస్తున్నానని మంత్రి అన్నారు. ఇందిరాగాంధీ హయాంలో 1969 ఉద్యమ సమయం 369 మంది దేశ యువకులపై కాల్పులు జరిపిన గొప్ప చరిత్ర కాంగ్రెస్‌దన్నారు. మలిదశ ఉద్యమంలోను ఎంతో మందిని పొట్టనపెట్టుకున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బలితీసుకున్నఅమాయకులకే రాహుల్‌గాంధీకి నివాళులర్పించిన సంగతి తెలుసా అని మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు.

Comments

comments

Related Stories: