అవమానం తట్టుకోలేక ఉపాధ్యాయురాలి ఆత్మహత్యాయత్నం…

The teacher suicide is not tolerate humiliation

చెన్నూర్‌: అవమాన తట్టుకోలేకనే చనిపోవాలని నిర్ణయించుకొని ఆత్మహత్యయత్నాకి పాల్పడినట్టు మండలంలోని బావురావుపేట ప్రభుత్వ పాఠశాలలో హింది ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న క్రిష్ణవేణి తెలిపారు. మూడు రోజుల క్రితం తమ పాఠశాలలో విద్యార్థులతో మరుగుదొడ్లు శుభ్రం చేయిస్తున్న ఉపాధ్యాయురాలు అని తమ విద్యార్థులు వారి అవసరాల కోసం మరుగుదొడ్డిలో నీరు నింపుకునే సమయంలో ఫొటోలు తీశారు. ఆ ఫొటోలను తమ తోటి ఉపాధ్యాయుడు తన పై కోపంతో ఓ విద్యార్థి సంఘానికి పంపడం జరిగింది. విద్యార్థి సంఘాల నాయకులు ఈ విషయాన్ని వక్రికరించి చెప్పడంతో వారు తమ పాఠశాలకు వచ్చి తనను నానా రకాలుగా అన్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అంతే కాకుండా ఈ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి తనను అవమానానికి గురి చేశారని ఆమె వాపోయింది. విద్యార్థులతో ఎంతో అప్యాయంగా ఉండే తనను అబాసుపాలు చేశారని తోటి ఉపాధ్యాయుల ముందు తనను చులుకన భావంతో చూసే పరిస్థితి తట్టుకోలేక ఈ అగాయిత్యానికి పాల్పడినట్లు ఆమె తెలిపింది. దీనికి కారణం తోటి ఉపాద్యాయుడు వెంకటస్వామి అని తెలిపింది. గతంలో తనకు ఓ విషయంలో క్షమాపణలు చెప్పాడని, అది మనసులో పెట్టుకొని పాఠశాల విద్యార్థులు తమ అవసరాల కోసం నీళ్లు తెచ్చే దృశ్యాలను విద్యార్థి సంఘాలకు పంపాడని ఆమె ఆరోపించింది. ఇలా ఉంటే బావురావుపేట పాఠశాలలో జరిగిన ఈ సంఘటన తీవ్ర సంచనలం రేపుతుంది. తోటి ఉపాధ్యాయుడే ప్రతికారం తీర్చుకునేందుకు విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులను పావుగా వినియోగించుకున్నాడని, ఆ ప్రయత్నంలో ఉపాధ్యాయుడు విజయవంతం కాగా విద్యార్థి సంఘాల నాయకులు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటు అబాసుపాలు కావాల్సి వస్తుంది.

Comments

comments