అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి…

take advantage of opportunities to come

ఉట్నూర్‌: నిరుద్యోగ యువత ఉపాధి శిక్షణ అనంతరం అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఐటిడిఎ పివొ కృష్ణా ఆదిత్యా సూచించారు. గురువారం మండల కేంద్రంలో కెబి ప్రాంగణంలో వైటిసి కేంద్రంలో ఐటిడిఎ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సానిటరి నాప్కిన్స్ తయారి కేంద్రంను ఐటిడిఎ పివొ, ఆయన సతీమణి పుష్పతో కలిసి ప్రారంభించారు. అనంతరం పివొ మాట్లాడుతూ యువత ఉపాధి మార్గాలు పొంది ఆర్థికంగా అభివృద్ది సాధించాలన్నారు. యువతులకు సానిటరీ నాప్కిన్స్ తయారిలో శిక్షణ ఇచ్చెందుకు యూనిట్‌ను ఏర్పాటు చేశామన్నారు. శిక్షణ అనంతరం మంచి ఉపాధి దొరుకుతుందని అన్నారు. ప్రభుత్వం తరుపున ఋణ సదుపాయాలు సైతం కల్పించడం జరుగుతుందన్నారు. ఉట్నూర్‌లోని 6 మందికి ఈ యూనిట్‌లో ఉపాధి కల్పించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైటిసి జౌట్స్ జెడియం నాగభూషణం, కో ఆర్డినేటర్‌లు రాఘవరెడ్డి, పాండు తదితరులు ఉన్నారు.

Comments

comments