అల్లు అరవింద్‌కు నచ్చగానే హిట్ అని తెలిసిపోయింది

AlluAravind

దర్శకుడు సంపత్‌నంది నిర్మాతగా సంతోష్ శోభన్, రియా సుమన్, తాన్యా హోప్ హీరోహీరోయిన్లుగా వస్తున్న చిత్రం ‘పేపర్ బాయ్’. జయశంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, దర్శకులు వి.వి.వినాయక్, మెహర్ రమేష్, సుకుమార్, ఎన్.శంకర్, దశరథ్‌లు అతిథులుగా వచ్చారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ “ఈ సినిమా చూసిన తర్వాత నచ్చడంతో నేను డిస్ట్రిబ్యూషన్‌కు తీసుకున్నాను.

ఓ మంచి సినిమాను విడుదల చేస్తుండడం ఆనందంగా ఉంది. సంపత్‌నంది ఓ యంగ్‌స్టర్‌కు దర్శకుడిగా అవకాశమిచ్చి ఈ సినిమాను నిర్మించాడు. దర్శకుడు జయశంకర్‌లో మంచి టాలెంట్ ఉంది. హీరో సంతోష్‌లో మంచి ప్రతిభ ఉంది”అని అన్నారు. చిత్ర నిర్మాత సంపత్ నంది మాట్లాడుతూ “అల్లు అరవింద్ సినిమా చూసి నచ్చిందనగానే హిట్ అని తెలిసిపోయింది. దర్శకుడు జయశంకర్ సినిమాను చాలా బాగా హ్యాండిల్ చేశాడు. సంతోష్ శోభన్ చక్కగా నటించాడు. అతనికి మంచి భవిష్యత్తు ఉంది”అని తెలిపారు. హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ “అల్లు అరవింద్ మా సినిమాను విడుదల చేస్తుండడంతో హ్యాపీగా ఉంది. సంపత్‌నంది, జయశంకర్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెహర్ రమేష్, రియా సుమన్, భీమ్స్ సిసిరోలియోతో పాటు చిత్ర బృందం పాల్గొంది.

Comments

comments