అల్లుకుపోయే సంగీతం

బెంగాలీ కవిత్వం బెంగాలు సాహిత్యానికి బోలెడంత వారసత్వ సంప దుంది. రవీంద్రనాథ్ ఠాగూ రు అన్నా, శరత్ బాబు అన్నా తెలియనివారుండరు. అంత బలమైన పునాదులుండబట్టి, ఎన్నాళ్లకైనా ఆ సాహిత్యం అందర్నీ అబ్బురపరుస్తూనే ఉంటుంది. కవులు తమలో తాము మాటాడుకుంటు న్నా, ప్రపంచమే వారిని వింటూ ఉంటుందని ఎవరో అన్నది చాలా మంది కవులతోబాటు, బెంగాలు కవులకి కూడా అన్వయిం చుకోవచ్చు. బెంగాలులో వర్తమాన కవిత్వ తీరు తెన్నులు గురించి మాట్లాడుకునే ముందు, బెంగాలీ కవిత్వం పుట్టుపూర్వోత్తరాల […]

బెంగాలీ కవిత్వం

బెంగాలు సాహిత్యానికి బోలెడంత వారసత్వ సంప దుంది. రవీంద్రనాథ్ ఠాగూ రు అన్నా, శరత్ బాబు అన్నా తెలియనివారుండరు. అంత బలమైన పునాదులుండబట్టి, ఎన్నాళ్లకైనా ఆ సాహిత్యం అందర్నీ అబ్బురపరుస్తూనే ఉంటుంది. కవులు తమలో తాము మాటాడుకుంటు న్నా, ప్రపంచమే వారిని వింటూ ఉంటుందని ఎవరో అన్నది చాలా మంది కవులతోబాటు, బెంగాలు కవులకి కూడా అన్వయిం చుకోవచ్చు. బెంగాలులో వర్తమాన కవిత్వ తీరు తెన్నులు గురించి మాట్లాడుకునే ముందు, బెంగాలీ కవిత్వం పుట్టుపూర్వోత్తరాల గురించి కాస్సేపు మాటాడుకుందాము. బెంగాలీ కవిత్వాన్ని, 1350 కి పూర్వం చార్యపథ్ లేక చార్యగీతి కవిత్వ యుగమని, 1350 నుండి 1800 వరకూ మధ్యయుగ కవిత్వమని, 1800 నుండి ఇప్పటి వరకూ ఆధునిక కవిత్వ యుగమని స్థూలంగా మూడు భాగాలుగా మనం చూడొచ్చు.

ఇంకాస్త అందరికీ అర్ధమయేట్టుగా చెప్పుకో వాలంటే, మనం దీన్ని ఠాగూరుకు ముందరి కవిత్వం అని, ఠాగూరు కాలం కవిత్వమని, ఠాగూరు తరువాతి కవిత్వమని చెప్పుకోవచ్చు. నేపాలు రాయల్ గ్రంధాల యంలో, మహామహోపాధ్యాయ్ హరిప్రసాద శాస్త్రి గారికి లభించిన, పదవ శతాబ్దానికి చెందిన, చార్యగీతి మార్మిక కవిత్వమే వారి మొదటి కావ్యం. మధ్యయుగ కవిత్వ కాలం ఎక్కువగా భక్తి కవిత్వానికి చెందిందే. పొరుగు రాష్ట్రంలోని 12వ శతాబ్దపు జయదేవుని ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది.13 వ శతాబ్దపు బాదు చండీదాసు శ్రీక్రిష్ణ కీర్తనలు, విద్యాపతి ప్రేమ గీతాలు, ఆ కాలపు అతిముఖ్య తాత్విక కవిత్వం. వైష్ణవ సంప్రదాయపు కవిత్వం, చైతన్య ప్రభువు మూలం గాను, చండీదాసు మూలంగాను మరింత వ్యాప్తి చెందింది. వైష్ణవ సంప్రదా యేతర కవిత్వానికి ఆ యుగంలో ఆద్యులుగా, 16వ శతాబ్దపు చండీమంగల్ కావ్యం రాసిన ముకుంద చక్రవర్తి, ముస్లిం కవులు అలోల్, అర్రాకన్ దౌలత్ కాజీలు గా గుర్తించొచ్చు.
ఆధునిక కవిత్వం భరత్ చంద్రతో మొదలై, అనేక మంది కవులు, బెంగాలీ కవిత్వానికి వన్నె తెచ్చారు. వారిలో ముఖ్యులుగా ఆధునిక కవిత్వానికి ఆద్యు లుగా గుర్తించే, మైకేల్ మధుసూదన్ దత్తా (1834-1873), బిహారీలాల్ చక్రవర్తి (1834-1894), ఆ తరువాత రవీంధ్రనాథ్ ఠాగూరు (1861-1941), కాజీ నజ్రుల్ ఇస్లాం (1899-1976), జతీంద్రమోహన్ బాగ్చీ (1878-1948) మొదలైనవారున్నారు.నిజానికి మన మెరిగిన ఆధునిక కవిత్వం రవీంద్రనాథ ఠాగూరు నుండి, ఎక్కువగా 1920 తరువాతే ఒక ఉద్య మంగా జయప్రదంగా వచ్చింది. బెంగాలీ కవిత్వంలో అదొక అతిపెద్ద మార్పు, విషయపరంగా గాని, నిర్మాణ పరంగా గాని. సామ్యవాదానికి అనుకూలంగా కవిత్వా న్ని మొదలెట్టిన వారు ,సుకాంత భట్టాచార్య, సమర్ సేన్. విప్లవవాద కవిత్వం కూడా ఈ దశలోనే రూపుది ద్దుకుంది.

సమర్‌సేన్, సుభాస్ ముఖో పాధ్యాయ్, అస్పష్ట కవిత్వం వేపు మొగ్గు చూపినా, మధ్య తరగతి ప్రజానీకపు, పాత కొత్తలమధ్య ఊగిసలాటని ప్రతిభా వంతంగా తమ కవిత్వంలో ఆవిష్క రించారు. సుభాస్ ముఖోపాధ్యాయ్ మార్క్సిస్టు భావాలతో మానవీయత సాధ్య మని, కవిత్వం దానికి మాధ్యమంగా భావించా రు. అయినా కవిత్వం నీతి బోధగాకాక, రసానికి సంబధించినదిగా తీసుకోవటాన్ని, వీరి గొప్ప కవితలు గా పేరొచ్చి విశ్వజనీనమైనాయి.
ఠాగూరు తరువాత కవుల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గ వారు, కాజీ నజ్రుల్ ఇస్లాం, సత్యేంద్ర దత్త (1882-1922), మోతీలాల్ ముజుందార్ (1888-1952), జీబనానంద దాస్ (1899-1954), సుధీంద్రనాథ్ దత్త (1901-1960), అమియ చక్రవర్తి (1901-1986), అచింత్యకుమార్ సెన్ గుప్త (1903 -1996), ప్రేమేంద్ర మిత్రా (1904-1988), బుద్ధదేవ్ బోస్ (1908-1974), బిష్ణు డే (1909-1982), సమర్ సేన్ ( 1916-1987). వీరంతా బెంగాలీ కవిత్వ రూపురేఖల్ని మార్చారు. 1930-1940 ప్రాంతాల్లో వారిదైన కవిత్వంతో బెంగాలీ సాహి త్యాన్ని ఒక మలుపు తిప్పారు. మరీ ముఖ్యంగా జీబనానంద దాస్ విలక్షనీయత, సుధీంద్రనాథ్ గాఢత, బిష్ణు డే సంక్లిష్టత అందర్నీ ఆకట్టుకున్నాయి. బుద్ధదేవ్ బోస్ బెంగాలీ ఆధునిక కవిత్వాన్ని ఒక సంశయించే అలసటగా, అన్వేషణగా, తిరుగుబాటుగా, వ్యతిరేకత గా అభివర్ణించారు. ఈ కవిత్వ కాలం ప్రగతి, కల్లోల కవిత్వానికి చెందింది.రెండవ ప్రపంచ యుద్ధ ప్రభావం తో రాసిన కవుల్లో ముఖ్యులు – దినేష్ దాస్ (1913-1985) , సుకుంత భట్టాచార్య (1926-1947), అరున్ మిత్రా (1909-2000), నీరేంద్రనాథ్ చక్రవర్తి, సుభాస్ ముఖోపాధ్యాయ్ (1919-2003), అబుల్ కాసిం రహుముద్దిన్ ఉన్నారు.
ఆంగ్లేయుల రాజకీయాల కారణంగా భారతదేశం మతం ప్రాతిపాదికగా చీలిపోయి న తరుణంలో, ఇస్లాము మతం నేపధ్యంతో రాసిన ముస్లిం కవిత్వం కూడా ఉంది. సయ్యద్ ఇస్మాయిల్ హుస్త్స్రన్ షిరాజి, గులాం ముస్తాఫా, ఫరూక్ అహ్మద్, తాలిం హుస్త్స్రన్, అబ్దుల్ ఖాదిర్ మున్నగు వారున్నారు. వీరిలో అబ్దుల్ ఖాదిర్ (1906-1984) అభ్యుదయవాదిగా, తనదైన శైలితో అందరి దృష్టినీ ఆకర్షించాడు.నూతన కవిత్వకదలిక అని ఆధునిక కవిత్వం లోని భాగంగానే 1980 లో మొదలయ్యింది. స్వదేష్‌సేన్ రాసిన ‘రాఖా హోయిచే కమలాలేబు‘ అన్న కావ్యం ప్రేరణ.

అందులో భాగంగా, బారిన్ ఘోసాల్, అలోక్ బిస్వాస్, స్వపన్ రాయ్, ధీమన్ చక్రవర్తి, రంజన్ మైత్ర, ప్రనబ్ పాల్, అర్యనిల్ ముఖోపాధ్యాయ్, అతను బందోపాధ్యాయ్, రాజశ్రీ చట్టోపాధ్యాయ్, అనుపం ముఖోపాధ్యాయ్, సబ్యసాచి సాన్యాల్, అరుపరతన్ ఘోష్, ఇంద్రాణీ ఘోష్ మొదలైన చాలా మంది ఉన్నారు. వీరందరిలో అనుపం ముఖోపాధ్యాయ్ బాగా పేరు తెచ్చుకున్న యువకవి. భాషలోను, శైలిలోను మార్పు కోసం ఆరాటం వీరి కవితల్లో ఎక్కువ కనిపిస్తుంది. అది కొంత వివాదాల్ని కూడా రేకెత్తించింది.ఆధునికాంతర కవిత్వం 1993లో, ప్రభాత్ చౌదురి సంపాదకత్వంలో వెలువడిన కబితా పాక్షిక్ అన్న పక్ష పత్రికతో మొదలయ్యింది. బెంగాలీ కవిత్వాన్ని ఇది ఒక కుదుపు కుదిపింది. దీని ద్వారా అనేకమంది కొత్త కవులకు దారి దొరికింది. అప్పటినుండి ఈ పత్రిక ఆగిపోకుండా వస్తూనే ఉంది. ప్రభాత్ చౌదురి, మురారీ సిణా, నాసెర్ హోప్‌స్త్స్రన్, సుభాషీస్ గంగోపాధ్యాయ్, రజతేంద్ర ముఖోపాధ్యాయ్, షంతాను బందోపాధ్యాయ్, రుద్ర కింగ్షుక్, అఫ్జల్ ఆలీ, గౌరంగ మిత్ర మొదలయిన ఎందరో యువకవులకు అది వేదికయింది. కొత్త యుగంలో కొత్త కవులకు అదొక ముఖ్య భూమికగా అవతరించింది.
2000 సంవత్సరం నుండి చెప్పుకోదగ్గ మార్పు అంతా కవులు నగరాలకు, ముఖ్యంగా కలకత్తాకే పరిమితం కాకుండా, అంతకు ముందు తెలియని చిన్న పట్టణాల నుండి, గ్రామాల నుండి కూడా రాయడం. ఇదంతా సంచార వ్యవస్థ వ్యాప్తి మూలంగా సాధ్యమైందని చెప్పుకోవాలి. అంతకు ముందు ఎవరూ స్పృశిం చని అంశాలు, ఎవరూ చెప్పని కొత్త పద్దతిలో, సరికొత్త శిల్పంతో, నిజాయితీగా రాస్తున్న కవిత్వ మది. అలా రాస్తున్న వారిలో అనుపం ముఖోపాధ్యాయ్, ఇం ద్రాణీల్ ఘోష్, అరుప్రతన్ ఘోష్, అమితవ ప్రహరాజ్, అనన్య సిణా మొదలయిన వారు, ఈ కోవకు చెందిన కవులు. ఆశ్చర్యంగా పేరున్న పత్రికలకు కాకుండా, అంత ప్రాచుర్యంలో లేని పత్రికల కు రాస్తున్న వాళ్లే ఎక్కువ.బెంగాలీ కవిత్వంలో పత్రికల పాత్ర గురించి మనం తప్పకుండా చెప్పు కోవాలి.

బెంగాలులో వీటి మూలంగానే అనేక రకరకాల కవిత్వ వ్యాప్తి జరిగిందంటే ఆశ్చ ర్యంగానే ఉంటుంది. ప్రసిద్ధులైన కవులతో బాటు, సాధారణ కవుల వరకూ ఇందులో కనిపిస్తారు. అయితే ఆయా పత్రికలు ఆయా రకరకాల కవిత్వాలకు మాత్రమే ప్రతినిధులుగా నిలిచాయి. ఉదాహరణకి, 1950-1960 దశకంలొ శక్తి చట్టోపాధ్యాయ్, సునిల్ గంగోపాధ్యాయ్, నీరేంద్రనథ్ చక్రవర్తి సంయుక్తంగా ‘క్రిత్తిబాస్‘ అనే పత్రిక ద్వారా వారిదైన కవిత్వాన్ని వ్యాప్తి చేసారు. ఈ కవిత్వం జీవితంలో, దాడి, ఉక్రోషం, పొగరు, విశ్వాస ప్రకటన లాంటి యువతను ఆకర్షించే పద్ధతిలో నడిచింది. దాదాపు ఇదే సమయం లో మరో ముఖ్యమైన పత్రికగా అలోక్ సర్కార్ సంపాదకీయంలో ‘శతభిశ‘ వచ్చింది. వీరిది ఏ వాదానికీ లొంగని, ఏ సంఘటనమీదా ఆధారపడని, రాజకీయాలకు అతీతంగా, మార్మిక, ప్రతీక వాదంతో తనను తాను తెలుసుకునే సాధనంగా, మనతో గుసగుసలు పోతున్నట్టుగా ఉంటుంది. ఈ రెండు పత్రిక వర్గాలకు కాస్త దూరంగా, అరుణ్ మిత్ర, శంఖ ఘోష్, అలోకరంజన్ దాసుగుప్తా కవిత్వ మొచ్చింది.

వీరిది అనుభూతివాదం, శిల్పానికీ భిన్నమైన కవిత్వం. కవి ప్రవక్తగా కాకుండా, ఒక అంధుడిగా స్పర్శించేటట్టు కవిత్వం ఉండాలనేది వీరి నమ్మకం. శబ్దాలతోనూ, కోపతాపాలతోనూ కవిత్వం కంటే, నిశ్శబ్దం వేపు ప్రయణించేట్టు ఉండాలని వీరి వాదం. జీవితం అనేక కోణాల సంక్లిష్టతని సైతం క్లుప్తంగా చెప్పటంలో అందెవేసిన కవిగా గుర్తింపు పొందారు. అళొకరం జన్ దాసుగుప్తాది సరికొత్త విషయాల్ని స్పృశిస్తూ, ప్రసం గంలా సాగే కవిత్వం. వీరు జర్మనీలో ఇరయ్యేళ్లకు పైగా గడిపి వచ్చాక వీరి కవిత్వ పంధా పూర్తిగా మారిపోయింది. విశ్వజనీనమైన కవిత్వానికి ఆ తరువాత వారిలో ప్రాముఖ్యత పెరిగింది.
అరవయ్యో దశకంలో రెండు ఉద్యమాలు ఊపిరి పోసుకున్నాయి. ఒకటి ఆకలి, ఇంకోటి స్మృతి. మొలయ్ రాయచౌదురి, షైలేష్వర్ ఘోష్ ఆకలి ఉద్య మానికి కవిత్వ సారధులు. అమెరికా బీట్నిక్ కవి, ఆల్లెన్ గింస్బెర్గ్ మొలయ్ ఇంట్లో వీరితో బాటు ఉండ టం కూడా వీరి ఆకలి కవిత్వానికి పరోక్ష ప్రేరణ. ఏ ఆచ్చాదనలూ లేని దిగంబర కవిత్వం వీరిది. శృతి కవిత్వాన్ని నడిపించిన కవుల్లో ముఖ్యులు, పుస్కర్ దాసుగుప్తా, పరేష్ మొండల్, మ్రినాల్ బసుచౌధురి, సజల్ బందోపాధ్యాయ్. నిజమైన కవిత్వం అంతర్ము ఖీనమై తనలో తాను కోల్పోయినప్పుడే వస్తుందని వీరి నమ్మకం. పదాలు వాక్యాల పొందిక, వాటి మధ్య ఖాళీల విషయంలో జాగ్రత్తలు, ఆశ్చర్యార్ధకాలు లేకుండా, వస్తువుతో బాటు, శిల్పంపైన కూడా చెప్పు కోదగ్గ శ్రద్ధ తీసుకోవటం వారిలో గమనించొచ్చు. ఇదే సమయంలో సంఖ్యాపరంగా తక్కువే అయినా, కాలిక్రిష్ణ గుహ, భాస్కర్ చక్రవర్తి లాంటి కవులు, నిరాశ, నిస్పృహ, ఏకాకి తనంతో కొట్టుమిట్టాడున్నట్టు కవిత్వం కొనసాగించారు.ఏడవ ఎనిమిదవ దశకంలో కవిత్వం రూప పరంగా మార్పు చెందింది. జీవితంలోని వెలుగు నీడలకంటే, శ్రామికుల స్వేదం, రక్తం, సామా జిక వాస్తవికత పట్ల ఆదరణ పెరిగింది. నక్సల్బరీ ఉద్యమం పట్ల సానుభూతి, సామాజిక అసమా నతలపట్ల క్రోధం, వీటిని విస్మరించటం అమాన వీయంగా భావించటం వీరి కవిత్వంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
ఎనిమిదవ దశకంలో స్త్రీవాద కవిత్వం, అకవిత్వం ఉద్యమాలుగా రూపు దిద్దుకున్నాయి. అకవిత్వానికి ఆద్యులుగా, బుద్ధదేవ్ దాసుగుప్తా, మానిక్ చక్రవర్తి, అశోక్ చట్టోపాధ్యాయ్, అరవయి దశకంలోని ప్రముఖ కవి సుబోధ్ సర్కార్ ఉన్నారు. అవి గేయకవిత్వానికి విరుద్ధంగా వచ్చి ప్రజల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. స్త్రీలపట్ల పెరుగుతున్న సామాజిక అసమానతలు, వివక్ష మూలంగా ఉత్పన్నమైన సమస్యలు స్త్రీ వాదానికి వస్తువులు. మగవారినుండి సానుభూతి కాకుండా, వారంతా మానసికంగా మారాలన్న ధ్యేయంతో, స్త్రీల పట్ల గౌరవం పెరగాలన్న ఆలోచనలతో సాగిన కవిత్వమిది. వీరిలో ప్రముఖం గా క్రిష్ణ బసు, మల్లికా సెన్ గుప్తా లాంటివారు కనిపిస్తారు. ఇరవయ్యో శతాబ్దం ఆఖరి భాగంలో అధునికాంతర కవిత్వ మొచ్చింది. యాభయి దశకంలో ప్రముఖ కవి ఉత్పల్ కుమార్ బసు, అరవయి దశకంలో ప్రసిద్ధ కవి ప్రభాత్ చౌధురి, ఆధునికాంతర కవిత్వాన్ని లేవ దీసారు. వీరిని అనుసరించిన వారిలో ఆంశుమన్ కార్, బిభాస్‌రాయ్ చౌధురి, మందక్రాంత సేన్‌లు ఉన్నా రు. సంప్రదాయ కవిత్వంలోని తర్కం, ఆలోచన పట్ల వ్యతిరేకత ఇందులో ప్రముఖంగా కనిపిస్తుంది. ఆంశుమన్ కార్ సంకలనం పేరు ఆపెల్ సహరేర్ రాజా, అనగా ఆపెలు నగరం రాజు. అలాగే మందక్రాంత సేన్ సంకలనం పేరు – హ్రిదయ్ అభధ్య మెయ్ అంటే అమర్యాదమైన పిల్లే హృదయం అని. మనం ముందే చెప్పుకున్నట్టు బెంగాలీ సాహిత్యానికి పునాదులు చాలా బలంగానే ఉన్నాయి, అవి ఎన్నాళ్లయినా వారిని బలంగా దృడం గా కవిత్వాకాశంలో నిలబెడతాయి.

ముకుంద రామారావు
9908347273

Comments

comments