అలా అడక్కండీ.. మీడియాపై మిథాలీ ఆగ్రహం?

 మహిళా క్రికెట్ టీమిండియా కెప్టెన్ మిథాలీరాజ్ కు కోపమొచ్చింది. రేపటినుండి ఇంగ్లండ్ లో మహిళల వన్డే వరల్డ్ కప్-2017 ప్రారంభంకానున్న సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి అగిన ప్రశ్నకు ఆమె ఒకింత అసహనం వ్యక్తం చేసింది. భారత పురుషుల క్రికెట్ జట్టులో మీకిష్టమైన క్రికెటర్ ఎవరు? అనే ప్రశ్నకు ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే ప్రశ్న మీరు పురుష క్రికెటర్ని అడుగుతారా అంటూ తీవ్రంగా స్పందించారు. మీకు ఇష్టమైన మహిళా క్రికెటర్ ఎవరని అడగనప్పుడు పురుష […]

 మహిళా క్రికెట్ టీమిండియా కెప్టెన్ మిథాలీరాజ్ కు కోపమొచ్చింది. రేపటినుండి ఇంగ్లండ్ లో మహిళల వన్డే వరల్డ్ కప్-2017 ప్రారంభంకానున్న సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి అగిన ప్రశ్నకు ఆమె ఒకింత అసహనం వ్యక్తం చేసింది. భారత పురుషుల క్రికెట్ జట్టులో మీకిష్టమైన క్రికెటర్ ఎవరు? అనే ప్రశ్నకు ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే ప్రశ్న మీరు పురుష క్రికెటర్ని అడుగుతారా అంటూ తీవ్రంగా స్పందించారు. మీకు ఇష్టమైన మహిళా క్రికెటర్ ఎవరని అడగనప్పుడు పురుష క్రికెట్ జట్టులో ఇష్టమైన క్రికెటర్ ఎవరు అని మమ్మల్ని ఎలా అడుగుతారని అసహనం వ్యక్తం చేశారు.
పురుష క్రికెటర్లకు ఉన్న క్రేజ్ తమకు ఉండదని, అలాంటప్పుడు వారితో తమను పోల్చడం సరికాదన్నారు మిథాలీరాజ్. పురుష క్రికెటర్లకు, మహిళ క్రికెటర్లకు చాలా వ్యత్యాసం ఉందని, వారితో తమను పోల్చొద్దని అన్నారు. పురుష క్రికెటర్ల మ్యాచ్ జరిగితే టివిల్లో ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది. అదే మహిళా క్రికెటర్ల మ్యాచ్ లను ఎందుకు చూపరు అంటూ మీడియా ప్రతినిధిని ఎదరు ప్రశ్నించింది.

Women’s cricket team captain Mithali Raj was angry ?