అర్హులైన ప్రతి రైతుకు పెట్టుబడి సాయం

మన తెలంగాణ/వనపర్తి ప్రతినిధి: రైతు బంధు పథకం కింద ఎలాంటి పెండింగ్ కు అవకాశం లేకుండా స్పష్టంగా ఉన్న పట్టాదారు పాస్‌బుక్‌లు, చెక్కుల పంపిణీనిరానున్న 15,20 రోజుల్లో వందశాతం పూర్తి చేయాలని కలెక్టర్ శ్వేతా మహంతి ఆదేశించారు. గురువారం ఆమె తన చాంబర్‌లో తహశీల్దార్లు, వ్యవ సాయాధికారులతో రైతుబంధు పథకం, భూరికార్డుల నవీకరణపై సమీక్షించారు. మిగిలిపోయిన చెక్కులు, పట్టాదారు పాస్‌బుక్‌లను గ్రామాల వారిగా షెడ్యూల్ రూపొందించి గ్రామాల్లో పంపిణీ చేయాలని ఆదేశించారు. తప్పులు దొర్లిన పట్టాదారు పాస్‌బుక్‌లు, […]

మన తెలంగాణ/వనపర్తి ప్రతినిధి: రైతు బంధు పథకం కింద ఎలాంటి పెండింగ్ కు అవకాశం లేకుండా స్పష్టంగా ఉన్న పట్టాదారు పాస్‌బుక్‌లు, చెక్కుల పంపిణీనిరానున్న 15,20 రోజుల్లో వందశాతం పూర్తి చేయాలని కలెక్టర్ శ్వేతా మహంతి ఆదేశించారు. గురువారం ఆమె తన చాంబర్‌లో తహశీల్దార్లు, వ్యవ సాయాధికారులతో రైతుబంధు పథకం, భూరికార్డుల నవీకరణపై సమీక్షించారు. మిగిలిపోయిన చెక్కులు, పట్టాదారు పాస్‌బుక్‌లను గ్రామాల వారిగా షెడ్యూల్ రూపొందించి గ్రామాల్లో పంపిణీ చేయాలని ఆదేశించారు. తప్పులు దొర్లిన పట్టాదారు పాస్‌బుక్‌లు, చెక్కులను సరి చేయాలని చెప్పారు. ఈనెల 27 నుండి ధరణి వెబ్ సైట్ ప్రారంభమౌతుందన్నారు. రానున్న 20 రోజుల్లో రైతు బంధు పథకం చెక్కులు, పట్టాదారు పాస్ బుక్‌లను రైతులకు అందజేయాలని వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. ఎలాంటి రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాస్‌బుక్‌లను పెండింగ్‌లో ఉంచరాదని ఆదేశించారు. సమావేశంలో జెసి పి.చంద్రయ్య, ఆర్డీఒ చంద్రారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారిణి సుజాత, తహశీల్దార్లు, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.

Related Stories: