అర్హులైన అందరికి బ్యాంకు ఖాతాలు తెరిపించాలి

మన తెలంగాణ/ఆసిఫాబాద్: జిల్లాలో అర్హులైన ప్రతీ ఒక్కరికి బ్యాంకు ఖాతాలు తెరిపించాలని కలెక్టర్ ప్ర శాంత్ జీవన్ పాటిల్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ స్వరాజ్ అభియాన్2 లో భాగంగా జిల్లాలో 149 గ్రామాల్లో వందశాతం ఫైనాన్షియల్  ఇంక్లూజన్ సాధించేందుకు సంబంధిత బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. మన జిల్లా లో 24 బ్రాంచీలలో 149 గ్రామాలలో గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమం జూన్ 1 నుండి […]

మన తెలంగాణ/ఆసిఫాబాద్: జిల్లాలో అర్హులైన ప్రతీ ఒక్కరికి బ్యాంకు ఖాతాలు తెరిపించాలని కలెక్టర్ ప్ర శాంత్ జీవన్ పాటిల్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ స్వరాజ్ అభియాన్2 లో భాగంగా జిల్లాలో 149 గ్రామాల్లో వందశాతం ఫైనాన్షియల్  ఇంక్లూజన్ సాధించేందుకు సంబంధిత బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. మన జిల్లా లో 24 బ్రాంచీలలో 149 గ్రామాలలో గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమం జూన్ 1 నుండి చేపట్టడం జరిగిందన్నారు. 149 గ్రామాలలో బ్యాంకు ఖాతాలు లేని వారికి జీరో బ్యాలెన్స్ ఖాతాను అర్హులైన వారికి జీవన్ జ్యోతి బీమా, జీవన్ సురక్ష బీమా యోజన చేయించడం జరుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించుటకు కేంద్ర ప్రభుత్వం ఎస్. కృష్ణన్, ఈడి సిండికేట్ బ్యాంకు ప్రధాన కార్యాలయం బెంగుళూర్ వారిని నోడల్ అధికారిగా నియమించడం జరిగిందన్నారు. 149 గ్రామాలలో 21700 బ్యాంకు ఖాతాలు, 30591 జీవన్ జ్యోతి భీమా, 46430 సురక్షా భీమా యోజన పథకాలను పూర్తిచేయడం జరిగిందన్నారు. ఎంపిక చేసిన గ్రామాలలో ఐకేపి సిబ్బంది ద్వారా సర్వే చేయించాలని అధికారులను ఆదేశించారు. బ్యాంకు ద్వారా జరుగుతున్న వివిధ పథకాలను అధికారులతో సమీక్షించారు. పట్ట రుణాల్లో స్కేల్‌ఆఫ్ ఫైనాన్స్ తప్పకుండా వసూలు చేయాలని బ్యాంకర్లను సూచించారు. దీనికి సంబంధించిన బోర్టులను బ్యాంకు బ్యాంచులలో ఏర్పాటు చేయాలన్నారు. పంట రుణాలకు ఫసల్ భీమా యోజనలో కవరేజ్ చేయాలన్నారు. నిరుద్యోగ యువతను పీఎంపీజిపి పథకం ద్వారా ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిండిగేట్ బ్యాంకు జీఎం చెంచు రామయ్య, లీడ్ బ్యాంకు మేనేజర్ శివప్రసాద్, ఎల్‌డిఎం రామకృష్ణ, అధికారులు పాల్గొన్నారు.

నూతన కలెక్టరేట్ కార్యాలయం త్వరగా పూర్తిచేయాలి…
జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని గురువారం కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, వచ్చే అక్టోబర్ నెల మొదటి వారానికల్లా పనులను పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్మాణ దశలో కార్యాలయాన్ని త్వరగా పూర్తిచేయాలని, పనులలో నాణ్యత పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో అర్‌అండ్‌బి అధికారులు నజీర్ హైమద్, వెంకటరమణ, గుత్తేదార్ కేశవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Related Stories: