అరెస్టులతో ఉద్యమాలు ఆగవు…

TTDP President L Ramana Speech About Petrol Price

హైదరాబాద్: లాఠీ తూటాలకు, అరెస్టులతో  ఉద్యమాలు ఆగవని తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ  న్నారు. పెట్రోల్ , డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ఆందోళన చేపట్టిన తెదేపా నేతలను పోలీసులు అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్టేషన్ కు తరలించారు.అనంతరం తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం చిక్కడపల్లి పోలీస్టేషన్ వెళ్లి వారిని పరామర్శించారు.  అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. పెట్రోల్‌, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఈ సందర్భంగా రమణ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా అరెస్టు చేసిన లక్షలాది మందిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే పోలీసులు అక్రమంగా అడ్డుకోవడం సరైంది కాదని రమణ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు పెంచడం వల్లే పెట్రో ధరలు పెరుగుతున్నాయని కోదండరాం పేర్కొన్నారు.

Comments

comments