అరుదైన తెల్లని ఖడ్గ మృగాల పునరుజ్జీవం

Rhinoceros Resurrection in World

ప్రపంచంలో అరుదైన తెల్లని ఖగ్గ మృగాల సంతతిని కృత్రిమంగా పెంపొందించడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇటీవలనే ప్రపంచంలోని చిట్టచివరి ఉత్తరాది తెల్లని మగఖడ్గ మృగం ‘సుడాన్’ చనిపోవడంతో శాస్త్రవేత్తలు ఈ ఖడ్గ మృగజాతిని ఎలాగైనా కాపాడుకోవాలని లక్షంగా పెట్టుకున్నారు. చనిపోయిన ఖడ్గమృగం తెగకు చెందిన డిఎన్‌ఎ ఆధారాలతో ప్రయోగాశాలలో అండాలను అభివృద్ధి చేశారు. దీని ద్వారా అంతరించిపోతున్న ఖడ్గమృగ జాతి సంతాన పరంపరను కాపాడగలమన్న ఆశాభావం వెలిబుచ్చారు. ప్రస్తుతం రెండే రెండు ఉత్తరాది తెల్లని ఖడ్గ మృగాలు జీవించి ఉన్నాయి. ఈ రెండూ సంతాన సాఫల్యత లేని ఆడ మృగాలు. తమ సాంకేతిక ప్రక్రియ ద్వారా ఉత్తరాది తెల్లని ఖడ్గ మృగాల జాతిని పునరుద్ధరించగలమన్న ఆశతో ఉన్నారు.

మూడేళ్లలో మొట్టమొదటి ఉత్తరాది తెల్లని ఖడ్గ మృగం కూనను పుట్టించడమే తమ లక్షంగా శాస్త్రవేత్త ధామస్ హిల్డ్‌బ్రాండ్ పేర్కొన్నారు. బెర్లిన్‌లోని జంతు ప్రదర్శనశాల, వన్యమృగ పరిశోధన విభాగానికి చెందిన లెయిబ్రిజ్ ఇనిస్టిట్యూట్ రీప్రోడక్షన్ మేనేజ్‌మెంట్ అధినేతగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ బృందం గుడ్లను వేరు చేసే రెండు మీటర్ల సాధనాన్ని ఉపయోగించి సరోగసీ (వేరే గర్భం) విధానం ద్వారా ఘనీభవించిన వీర్యాన్ని ప్రవేశపెట్టి కృత్రిమ అండాలను రూపొందించే ప్రక్రియను చేపట్టింది.

చనిపోయిన ఖడ్గ మృగం నుంచి సేకరించిన వీర్యాన్ని ఘనీభవింప చేయ డం, ఆడ ఖడ్గ మృగ అండకణాలను వాటితో సం యోగింప చేయడం తదితర ప్రయోగాల ద్వారా కృత్రిమ అండాలు రూపొందించడం జరుగుతుంది. ఐరో పా జంత ప్రదర్శనశాలల నుంచి అండకణాలను సేకరించారు. వీటిని తెల్ల ఖడ్గమృగం వీర్యంతో ఫలదీకరింప చేశా రు. ఫలదీకరణ అయిన అండ కణాలను ఆడ తెల్ల ఖడ్గమృగాల సంతతి పెరగడానికి మార్గం ఏర్పడింది. అం తరించిపోతున్న ఉత్తరాది తెల్లని ఖడ్గ మృగాల జాతిని పునరుద్ధరింప చేయడానికి అసిస్టిట్ రిప్రొడక్షన్ టెక్నిక్స్( ఎఆరేటి) ఒక్కటే తగిన మార్గంగా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
మన తెలంగాణ/ సైన్స్ విభాగం