అయ్యో దేవుడా…!

Kondagattu Ghat road accident

అంజన్న దర్శనానికి వెళ్లి వస్తూ అనంతలోకాలకు….

జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డుపై మంగళవారం జరిగిన ఘోర ప్రమాదంలో 57 మంది దుర్మరణం చెందారు.  మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.  మృతుల్లో  నలుగురు చిన్నారులు,  30 మంది మహిళలు, 23 మంది పురుషులు ఉన్నారు. జగిత్యాల డిపోకు చెందిన (ఎపి 28 జెడ్ 2319) ఆర్‌టిసి బస్సు కొడిమ్యాల మండలం శనివారంపేట నుంచి జగిత్యాలకు వస్తుండగా ఘాట్ రోడ్డుపై అదుపు తప్పి సుమారు 12 మీటర్ల లోతులో ఉన్న లోయలో పడగా 24 మంది ప్రయాణికులు అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు. మరో 33 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. బస్సులోని మిగతా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు జిల్లా ప్రధాన ఆస్పత్రితో పాటు పలు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో 20 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నది. జిల్లా ప్రధాన ఆసుపత్రి వద్ద మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించిన దృశ్యాలు గుండెలను కలచివేశాయి.

సిఎం కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి ,మెరుగైన వైద్యానికి ఆదేశాలు

మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను ఆదుకోవాలి
– తెలుగులో ట్వీట్ చేసిన రాష్ట్రపతి కోవింద్

షాక్‌కు గురయ్యాను
– ప్రధాని మోడీ

బాధితులకు సత్వర వైద్యం
– గవర్నర్ నరసింహన్

ప్రమాదం విచారకరం
– రాహుల్ గాంధీ