అయ్యో అయ్యో అయ్యయో..!(వీడియో)

బీజింగ్: సరదాగా ఈతకెళ్లిన ఓ చైనీస్ యువకుడు ఎవరూ ఊహించని విధంగా ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఓ సముద్ర జీవి తోక చివరలోని మొనదేలిన మూళ్లలాంటి భాగం అతడి పురుషాంగానికి గుచ్చుకుంది. దీంతో అతడి బాధ వర్ణణాతతీంగా మారింది. సహాయక సిబ్బంది వచ్చే వరకు అతడు బాధతో విలవిల్లాడిపోయాడు. సంఘటన వివరాల్లోకి వెళ్తే…  చైనాలోని సన్యా నగరంలో హనియన్ రిసార్ట్‌లో సెప్టెంబర్ 1వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. సముద్రంలో సరదాగా ఈతకు వెళ్లిన ఓ యుకుడు ఊహించని […]

బీజింగ్: సరదాగా ఈతకెళ్లిన ఓ చైనీస్ యువకుడు ఎవరూ ఊహించని విధంగా ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఓ సముద్ర జీవి తోక చివరలోని మొనదేలిన మూళ్లలాంటి భాగం అతడి పురుషాంగానికి గుచ్చుకుంది. దీంతో అతడి బాధ వర్ణణాతతీంగా మారింది. సహాయక సిబ్బంది వచ్చే వరకు అతడు బాధతో విలవిల్లాడిపోయాడు. సంఘటన వివరాల్లోకి వెళ్తే…  చైనాలోని సన్యా నగరంలో హనియన్ రిసార్ట్‌లో సెప్టెంబర్ 1వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. సముద్రంలో సరదాగా ఈతకు వెళ్లిన ఓ యుకుడు ఊహించని రీతిలో ప్రమాదం బారిన పడ్డాడు. డెవిల్ ఫిష్‌గా పిలిచే సముద్ర జీవి వెన్నెముక భాగం తోకలా ఉంటుంది. దాని మధ్యలో కొండిలా ఉండే మొనదేలిన భాగం యువకుడు ఈత కోడుతున్న సమయంలో అతడి పురుషాంగానికి గాలంలా పట్టేసింది. దాంతో బాధితుడు వెంటనే జీవితోపాటే ఒడ్డుకు చేరుకున్నాడు. బాధతో విలవిల్లాడుతున్న యువకుడిని చూసి బీచ్‌లో ఉన్న సందర్శకులు వెంటనే ఫైర్ ఫైటర్లతో పాటు వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారి సమాచారం మేరకు హూటాహూటిన అక్కడికి చేరుకున్న వైద్య సిబ్బంది అతడి పురుషాంగం నుంచి పెద్ద కత్తెర సాయంతో దాన్ని వేరుచేశారు. అనంతరం బాధితుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారు.  ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ లా వ్యాపిస్తోంది.

Comments

comments