అమ్మకాల్లో యాక్టివా రికార్డు…

హోండా కంపెనీ ద్విచక్రవాహనాల మార్కెట్‌లో ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇప్పుడు తాజాగా కోటి యాక్టివా స్కూటర్ల అమ్మకాలతో మారోసారి రికార్డు కెక్కింది. ఇటీవల విడుదలైన సిబిఆర్ 650 ఎఫ్ వాహనం వరకు కంపెనీ విడుదల చేసిన అన్ని హోండా వాహనాల అమ్మకం ద్వారా కస్టమర్లను పెంచుకుంటూనే ఉంటుంది. యాక్టివా స్కూటర్ మొదటి సారి 2001లో విడుదలైంది. అప్పటి నుంచి 2015 వరకు కోటి స్కూటర్లను విక్రయించింది. కేవలం 2015 జూలై నెలలోనే 2.5 లక్షల యాక్టివా స్కూటర్లను […]

హోండా కంపెనీ ద్విచక్రవాహనాల మార్కెట్‌లో ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇప్పుడు తాజాగా కోటి యాక్టివా స్కూటర్ల అమ్మకాలతో మారోసారి రికార్డు కెక్కింది. ఇటీవల విడుదలైన సిబిఆర్ 650 ఎఫ్ వాహనం వరకు కంపెనీ విడుదల చేసిన అన్ని హోండా వాహనాల అమ్మకం ద్వారా కస్టమర్లను పెంచుకుంటూనే ఉంటుంది. యాక్టివా స్కూటర్ మొదటి సారి 2001లో విడుదలైంది. అప్పటి నుంచి 2015 వరకు కోటి స్కూటర్లను విక్రయించింది. కేవలం 2015 జూలై నెలలోనే 2.5 లక్షల యాక్టివా స్కూటర్లను విక్రయించి రికార్డు సృష్టించిందని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. ఇది ఇంతగా విజయం సాధించటానికి, అత్యధిక సామర్థంగల ఇంజిన్, మంచి మైలేజ్, మోడ్రన్ లుక్ మోడల్స్ కావటమేనని ఆటోమొబైల్ నిపుణులు అంటున్నారు. యాక్టివాలో ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌ను ప్రవేశపెట్టడం కూడా కంపెనీ విక్రయాలు పెరగటానికి కారణమయ్యింది. ఉన్న మోడల్స్‌ను రీఫ్రెష్ చేయటం కూడా కంపెనీ ఎదుగుదలకు కలిసొచ్చిన అంశంగా చెప్పవచ్చు. యాక్టివా ఐ, యాక్టివా 3జి, యాక్టివా 125 వాహనాలు ఇప్పుడు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. ఇవి మార్కెట్‌లో ఉన్న ప్లెజర్, టివిఎస్ పెప్ట్, మహీంద్రా డ్యూరో, సుజుకీ ఫ్లేస్, టివిఎస్ విగోకు గట్టి పోటీని ఇస్తుంది. మెరుగైన ఫీచర్లతో, స్కూటర్ సెగ్మెంట్‌లో అత్యధిక సిసి ఇంజిన్‌ను ఆఫర్ చేస్తుండటం కూడా యాక్టివాకు కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు.

Comments

comments

Related Stories: