అమెరికా ఆంక్షలపై అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించిన ఇరాన్

హేగ్ : అమెరికా తాజాగా విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని అంతర్జాతీయ కోర్టులో ఇరాన్ పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే ఆంక్షల వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, తాజాగా ఆంక్షలు విధించడం 1955లో చేసుకున్న ఒప్పందానికి గండి కొట్టడమేనని తెలిపింది. తమ దేశాన్ని కాళ్లబేరానికి తెచ్చుకోడానికే ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలు విధించిందని చెప్పింది. అణ్వస్త్ర కార్యకలాపాలు చేపట్టమని ఇరాన్ 2015లోనే హామీ ఇచ్చిందని గుర్తు చేసింది. ఐనా 3 వారాల క్రితం ట్రంప్ ఆంక్షలు విధించారని తెలిపింది. […]

హేగ్ : అమెరికా తాజాగా విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని అంతర్జాతీయ కోర్టులో ఇరాన్ పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే ఆంక్షల వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, తాజాగా ఆంక్షలు విధించడం 1955లో చేసుకున్న ఒప్పందానికి గండి కొట్టడమేనని తెలిపింది. తమ దేశాన్ని కాళ్లబేరానికి తెచ్చుకోడానికే ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలు విధించిందని చెప్పింది. అణ్వస్త్ర కార్యకలాపాలు చేపట్టమని ఇరాన్ 2015లోనే హామీ ఇచ్చిందని గుర్తు చేసింది.

ఐనా 3 వారాల క్రితం ట్రంప్ ఆంక్షలు విధించారని తెలిపింది. గత నవంబర్‌లో ఇరాన్‌పై అమెరికా తీసుకున్న శిక్షాత్మకమైన చర్యల వల్ల విద్యుత్ రంగంతో పాటు ఆయిల్ ఎగుమతులకు విఘాతం కలిగిందని అంతర్జాతీయ న్యాయస్థానానికి వివరించింది. హేగ్‌లోని ఇంటర్నేషనల్ కోర్టు ఆఫ జస్టిస్ ఇరాన్ వాదనలను వినడానికి అనుమతిచ్చింది. అమెరికా ఆంక్షల వల్ల ఆర్థిక రంగం కుదేలైందని, దీనివల్ల చమురు రంగంలో సమ్మెలు మొదలయ్యాయని, ఆర్థిక మంత్రిని పార్లమెంట్ అభిశంసించిందని అంతర్జాతీయ న్యాయస్థానం తెలిపింది. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి కొన్ని నెలలు పట్టవచ్చని న్యాయస్థానం భావిస్తోంది.