అమానుషం… 8 నేలల గర్భిణిపై గ్యాంగ్ రేప్..!

ముంబయి: కామంతో కళ్లు మూసుకుపోయి ఎనిమిది నేలల గర్భిణి అనే కనికరం లేకుండా ఓ మహిళ(20)పై 8 మంది సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన దారుణ ఘటన మహారాష్ట్రలోని సాంగ్లీలో జరిగింది. బాధితురాలి భర్తను కారులో కట్టేసి నిందితులు ఈ దారుణానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సతారా జిల్లా కేంద్రలో బాధిత దంపతులు ఓ హోటల్ నిర్వహిస్తున్నారు. అయితే, వారికి హోటల్ లో పనిచేసేందుకు ఇద్దరు వ్యక్తుల అవసవరం ఉంది. ఈ క్రమంలో ముకుంద్ మానే అనే […]

ముంబయి: కామంతో కళ్లు మూసుకుపోయి ఎనిమిది నేలల గర్భిణి అనే కనికరం లేకుండా ఓ మహిళ(20)పై 8 మంది సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన దారుణ ఘటన మహారాష్ట్రలోని సాంగ్లీలో జరిగింది. బాధితురాలి భర్తను కారులో కట్టేసి నిందితులు ఈ దారుణానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సతారా జిల్లా కేంద్రలో బాధిత దంపతులు ఓ హోటల్ నిర్వహిస్తున్నారు. అయితే, వారికి హోటల్ లో పనిచేసేందుకు ఇద్దరు వ్యక్తుల అవసవరం ఉంది. ఈ క్రమంలో ముకుంద్ మానే అనే వ్యక్తి ఆ దంపతులను కలిసి తనకు తెలిసిన వారు పనికోసం చూస్తున్నారని, వారికి రూ. 20వేల నగదు అవసరం ఉందని, అది మీరు వారికి సర్దుబాటు చేస్తే పనిలో పెట్టుకోవచ్చని నమ్మపలికాడు. దాంతో దంపతులు అతని మాటలు నమ్మి ఇరవై వేలు తీసుకుని ముకుంద్ వెంట తుర్చిఫాటా అనే ప్రాంతానికి వెళ్లారు. అప్పటికే అక్కడే ఉన్న తన ఏడుగురు స్నేహితులతో కలిసి ముకుంద్ హోటల్ యజమానిపై విచక్షణరహితంగా దాడి చేసి కారులో కట్టిపడేశారు. అనంతరం అతడి భార్యపై 8 మంది గ్యాంగ్ రేప్ చేశారు. ఆ తరువాత దంపతుల వద్ద ఉన్న నగదు, ఆభరణాలు దోచుకుని వారిని బెదిరించి అక్కడి నుంచి పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత బాధిత దంపతులు సమీపంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Comments

comments

Related Stories: