అభివృద్ధే తారక మంత్రం

Hyderabad is the most developed city

మన తెలంగాణ/సిటీబ్యూరో
విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే సిట్టింగ్‌లకే మరోమారు అసెంబ్లీ టిక్కెట్లను కేటాయించింది. ఎలాంటి అసమ్మతి రాగాల కు తావులేకుండా గత ఎన్నికల్లో పోటీచేసి ఓ డిన వారికే మరోమారు అవకాశం కల్పిస్తూ అభ్యర్థులుగా ప్రకటించింది. రాష్ట్ర మాజీ మంత్రి కెటిఆర్ సారథ్యంలోని నగర నాయకత్వం గ్రేటర్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుని మరోమారు తమ బలాన్ని వెల్లడించేందుకు సిద్ధ్దమైంది. ఈ పాటికే జిహెచ్‌ఎంసి పాలకవర్గానికి జరిగిన గత ఎన్నికల్లో 150 వార్డులకుగానూ 99 వా ర్డులను కైవసం చేసుకుని నగరంలో తమకు సాటెవ్వరులేరనేది టిఆర్‌ఎస్ నిరూపించింది. గ్రేటర్ హైదరాబాద్‌లో కేవలం రెండు నియోజకవర్గాల (సికింద్రాబాద్, మల్కాజిగిరి)ను గత ఎన్నికల్లో కైవసం చేసుకున్న పార్టీ ఇప్పుడు అత్యధిక సీట్లను గెలుచుకుని తమవెంటే నగరమనే నిజాన్ని ప్రజలకు వెల్లడించేందుకు సమాయాత్తమైంది. ప్రస్తుతం ప్రాతినిథ్య వహిస్తున్న 11 ఎమ్మెల్యే స్థానాలతో పాటు మరో 6 నియోజకవర్గాలను తమ ఖాతాలో వేసుకోవాలని పార్టీ ఆధినాయకత్వం ప్రత్యేక దృష్టిసారించింది.

అభివృద్ధే కీలకం
రాష్ట్ర పురపాలక శాఖ మాజీ మంత్రి కెటిఆర్ నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించారు. ఆయన జిహెచ్‌ఎంసి ఎన్నికల్లోనూ పార్టీ గెలుపు బాధ్యతలను తానే స్వీకరించి పార్టీని విజయపథాన నడిపిన విషయం విదితమే. ఈమారు కూడా గ్రేటర్‌లో పార్టీ అభ్యర్థుల గెలుపుపై తనదైన పాత్ర పోషించి తమ విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరనేది స్పష్టంచేయాలని చూస్తున్నారు. నగరంలో చేపట్టిన భారీ పథకాలు, షాదీముబారక్, అర్హులైన వారికి 6 కిలోల రేషన్ బియ్యం, కంటి వెలుగు వంటి వాటితోపాటు బంగారు తెలంగాణ కోసం టిఆర్‌ఎస్ రాజీలేకుండా చేస్తున్న కృషి ఈ ఎన్నికల్లో ప్రధానంగా వివరించాలని యోచిస్తున్నట్టు నగర నాయకులు వెల్లడిస్తున్నారు. ప్రతిఏటా ఎదురయ్యే తాగునీటి సమస్య, విద్యుత్ కోతలు గత నాలుగేళ్ళుగా టిఆర్‌ఎస్ పాలనలో అవి నగర దరిచేరలేదనేది ప్రచారంలో స్పష్టం చేయాలని నాయకత్వం భావిస్తున్నది. టిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్… బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల వారికి నగరంలో ప్రత్యేక సంక్షేమ భవనాలకు భుములు, వాటి నిర్మాణానికి నిధులు కేటాయించడం పార్టీ అభ్యర్థులకు మరింత కలిసిరానున్నది. నగర ప్రజలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ(బోనాలు, ఇఫ్తార్)లకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయించడం కూడా పార్టీని విజయ పథాన నడిపిస్తాయని నాయకులు భావిస్తున్నారు.
ప్రత్యర్థులే కరువు
గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతిపక్షాలకు ప్రధానంగా అభ్యర్థుల కొరత స్పష్టంగా ఉన్నదనేది టిఆర్‌ఎస్ భావిస్తున్నది. వారిలో గ్రూపు రాజకీయాలు, అసంతృప్తిలే వారి ఓటమికి దారితీస్తాయనే ధీమాలో నాయకత్వం ఉన్నది. ఇప్పటి వరకు ప్రత్యర్థుల వారికి నియోజకవర్గాల వారిగా అభ్యర్థులు ఎవరనేది స్పష్టత లేదని, టిక్కెట్ల కోసం ప్రయత్నాలుచేసి చివరి క్షణంలో టిక్కెటు రానివారంతా వ్యతిరేకంగా వ్యవహరించడం ఖాయమనే అభిప్రాయం నగర నాయకుల్లో వినిపిస్తున్నది. చాలా మంది నాయకులు తాము చేస్తున్న ప్రజాసంక్షేమ పాలన, నగరాభివృద్ధిని చూసి టిఆర్‌ఎస్‌లో చేరుతుండటంతో గ్రేటర్ అభ్యర్థులు మెజారిటీ కోసమే ఎన్నకల ప్రచారమనేట్టుగా ప్రజల్లోకి సంకేతాలు వెళ్ళేలా చూడాలని భావిస్తున్నారు. టిడిపి, కాంగ్రెస్‌లు పొత్తుపెట్టుకున్నప్పటికీ వారిలో ఎవరికి టిక్కెట్లు వస్తాయి..? ఎవరికి రావు అనేది వారికే స్పష్టత లేనందున, టిఆర్‌ఎస్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే అభ్యర్థులను ప్రకటించి నాయకుల్లోనూ, కార్యకర్తల్లోనూ, ప్రజల్లోనూ స్పష్టతనిచ్చామని, తమ పాలనలోనూ అన్ని విషయాల్లోనూ ఇదే తరహా నిర్ణయాలుంటాయని నగరవాసులు విశ్వసించేలా వివరించడం ద్వారా ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలనే ధీమాలో టిఆర్‌ఎస్ ఉన్నట్టు సీనియర్లు వెల్లడిస్తున్నారు.

Comments

comments