అభివృద్ధి పనుల్లో జాప్యమొద్దు

పట్టణాభివృద్ధిలో భాగంగా చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే చింతాప్రభాకర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. గురువా రం కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుతో కలిసి పట్టణాభివృద్ధి నిధులతో చేపట్టిన పనుల పురోగతి, లోటు పాట్లను హెచ్‌ఎండిఎ, మున్సిపల్ అధికారులతో ఆయన సమీక్షించారు. ఎమ్మెల్యే చింతాప్రభాకర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఎంత అభివృద్ధి చెందాలో అంత అభివృద్ధి జరగలేదన్నారు. జిల్లా కేంద్రాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి  రూ.14.37 కోట్లు […]

పట్టణాభివృద్ధిలో భాగంగా చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే చింతాప్రభాకర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. గురువా రం కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుతో కలిసి పట్టణాభివృద్ధి నిధులతో చేపట్టిన పనుల పురోగతి, లోటు పాట్లను హెచ్‌ఎండిఎ, మున్సిపల్ అధికారులతో ఆయన సమీక్షించారు. ఎమ్మెల్యే చింతాప్రభాకర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఎంత అభివృద్ధి చెందాలో అంత అభివృద్ధి జరగలేదన్నారు. జిల్లా కేంద్రాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి  రూ.14.37 కోట్లు ఇచ్చారని తెలిపారు. అందులో భాగంగానే బట్టర్ లైటింగ్స్, రోడ్డుపైన, మద్యలో ఉన్న విద్యుత్ స్థంబాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, వెనకకు పెట్టించడానికి, పుట్‌పాత్‌ల ఏర్పాటు, డ్రైన్స్ తదితర పనులను చేపట్టడం జరిగిందన్నారు. చేపట్టిన పనులను వేగవంతం చేయాలని సూచించారు. పనులు సవ్యంగా జరిగేలా చూడాలని తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన పనులపై పట్టణ ప్రజలు సంతృప్తిగా లేరని పేర్కొన్నారు.

ప్రజలకు అన్ని విధాల సౌకర్యవంతంగా ఉండేలా చేపట్టిన పనులలో జాప్యం జరగడంపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. పాదాచారుల కోసం నిర్మించినపుట్‌పాత్‌లను వారికి ఉపయోగపడేలా చూ డాలని, చిరు వ్యాపారులు, తోపుడుబండ్ల వారు పుట్‌పాత్‌లపై బండ్లు పెట్టడంతో పాదాచారులకు ఇబ్బంది కలుగుతుందని, ఇట్టి విషయంలో తగుచర్యలు చేపట్టాలని మున్సిపల్ కమీషనర్ ప్రసాద్‌రావుకు సూచించారు. పట్టణంలో పలు ప్రాంతాలలో వర్షం నీరు, డ్రైనేజీ వాటర్ రోడ్లపై నిలిచి ప్రజలు నడవడానికి ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. డ్రైన్స్ పనిచేయని చోట వెంటనే తగుమరమ్మత్తులు చేపట్టాలని, అక్కడ ఉన్న కల్వర్టును పెద్దగా నిర్మిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. కరెంటు స్తంబాలు పాత బస్టాండ్ నుంచి మహబూబ్‌సాగర్ చెరువు వరకు వేయా ల్సి ఉందన్నారు. డ్రైన్స్, పోల్స్, కల్వర్టులు, పుట్‌పాత్, రోడ్లు తదితర పనులను సకాలంలో త్వరలో పూర్తిచేసేలా అధికారులు ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు. ఇంకా ఏవేని గ్యాప్స్ ఉంటే పూర్తిచేసేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధవహించాలని సూచించారు. ఇంకా ఏవేని గ్యాప్స్ ఉంటే పూర్తి చేయడానికి అదనపు నిధులు ఇస్తామని మంత్రి తెలిపారని చెప్పారు. పార్టీలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరారు. ఏవేని లోటు పాట్లను గుర్తించినట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని కౌన్సిలర్లను కోరారు.

పట్టణ సుందరీకరణకు మున్సిపల్ పాలకవర్గం, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని చింతాప్రభాకర్ సూచించారు. జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అన్ని డ్రైన్స్ పూడుకుపోయి నీరు వెల్లడం లేదని, వాటన్నింటిని ఓపెన్ చేసి సరిచేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. రెండు సైడ్స్ డ్రైన్‌లలో కూరుకుపోయిన చెత్తతీసివేయించాలని, లైన్స్ మార్చ డం, ప్లాంటేషన్ చేయడం తదితర పనులను వేగవంతంగా చేయాలని అందంగా తీర్చిదిద్దడంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. బిటి రెన్యూవల్స్ అయిన తరువాతనే బ్లింకింగ్స్, జీబ్రాలైన్స్ పెట్టుకోవడం జరుగుతుందన్నారు. రోడ్డు డివైడర్స్ మద్యలో నాటిన మొక్కలలో ఏవేని మొక్కలు చనిపోతే వాటి స్థానంలో కొత్త మొక్కలు పెట్టాలని సూచించారు. పోల్స్‌కు, మొక్కలకు ప్లెక్సీలు కట్టకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమీషనర్‌కు ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే, కలెక్టర్, మున్సిపల్ చైర్‌పర్సన్, కౌన్సిలర్లు, హెచ్‌ఎండిఏ అధికారులు, మున్సిపల్ అధికారులు పట్టణంలో పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి పాతబస్టాండ్ వరకు పర్యటించి పను ల పురోగతి, సమస్యలను, గ్యాప్స్‌ను పరిశీలించారు. ఈ సమీక్షలో చైర్‌పర్సన్ బొం గుల విజయలక్ష్మీ, వైస్ చైర్మన్ గోవర్థన్ నాయక్, హెచ్‌ఎండివే అధికారి దయాకర్‌రెడ్డి, ఇఇలు,  కమీషనర్ ప్రసాద్‌రావు, అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Related Stories: