అభివృద్ధిలో తెలంగాణకు ఎదురు లేదు

అరవై ఏళ్లలో చేయలేని అభివృద్ధి నాలుగేళ్ళలో కెసిఆర్ చేసారు పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలల్లో మంత్రి జూపల్లి  మన తెలంగాణ/గద్వాల: తెలంగాణలో అభివృద్ధికి ఎదురులేదని అన్ని రంగాలల్లో దూసుకుపొతున్నామని 16 మంది ముఖ్యమంత్రులు చేయలేని అభివృద్ధి పనులను కెసిఆర్ నాలుగు సంవత్సారాలల్లో చేసి చూపించారని పంచాయతీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లాలో సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం బీటీ రోడ్ల శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 60 సంవత్సారాల […]

అరవై ఏళ్లలో చేయలేని అభివృద్ధి నాలుగేళ్ళలో కెసిఆర్ చేసారు
పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలల్లో మంత్రి జూపల్లి 

మన తెలంగాణ/గద్వాల: తెలంగాణలో అభివృద్ధికి ఎదురులేదని అన్ని రంగాలల్లో దూసుకుపొతున్నామని 16 మంది ముఖ్యమంత్రులు చేయలేని అభివృద్ధి పనులను కెసిఆర్ నాలుగు సంవత్సారాలల్లో చేసి చూపించారని పంచాయతీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లాలో సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం బీటీ రోడ్ల శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 60 సంవత్సారాల పాలనలో 16మంది ముఖ్యమం త్రులు పని చేశారని వారు చేయాలేని అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ నాలుగేళ్ళలోనే అభివృద్ధి చేసి చూపించారన్నారు. రైతులకు 24గంటల కరెంటు, రైతుబంధు పథకం కింద పెట్టుబడి సహాయం, 5లక్షల బీమా తదితర సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి రైతుల పక్షపతి అనిపించుకున్నరన్నారు. కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయన్నారు. ఇటీవల కేసిఆర్ మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారని పిడుగు పాటుకు మృతి చెందిన కుటుంబాలకు రూ.6 లక్షల ఆర్థిక సహాయాని ప్రకటించాన్నారు. ఇలా ఎన్నో పథకాలు ప్రవేశ పెడుతు తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శమన్నారు. ఇక్కడి పథకాలను ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదర్శంగా తీసుకుని అమలు పరుస్తున్నారంటే మన పథకాలు ఎంత గొప్పవో అర్థం చేసుకోవచ్చన్నారు. పేదరికనికి నిర్మూలించి రాష్ట్ర ప్రజలంత సుఖసంతోషాలతో ఉండలదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధేయ్యమన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నరన్నారు.

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన : మల్థకల్ మండలం పెద్దపల్లి నుంచి పావనపల్లి వరకు 3 కిలోమిటర్ల బీటి రోడుకు భూమి పూజ చేశారు. అధేవిధంగా గద్వాల మండలం కాకులారంలో సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. ఇటిక్యాల ఎర్రవల్లి చౌరస్తాలోని తెలంగాణ కార్పోరెటివ్ సోసైటీ బ్యాంకును ప్రారంభించారు. అనంతరం స్టేజి నుంచి బస్వచేర్వ సిసి రోడ్లకు పూజ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్ప్‌పి చైర్మన్ బండారీ భాస్కర్, అధికార ప్రతినిధి మందజగన్నాథం, డిసిసిబి చైర్మన్ వీరారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బండ్ల కృష్ణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అబ్రహం, మానిక్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: