అభివృద్ది,సంక్షేమ పథకాల్లో రాష్ట్రం అగ్రగామి

నిర్మల్‌: అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నివాళ్లర్పించారు. ప్రోఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు.తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, అన్ని వర్గాల అభ్యున్నతికి మన ముఖ్యమంత్రి కెసిఆర్  అహర్నిషలు కృషి చేస్తున్నారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎన్‌టిఆర్ మినీ స్టేడియంలో రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ముఖ్య అతిథిగా […]


నిర్మల్‌: అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నివాళ్లర్పించారు. ప్రోఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు.తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, అన్ని వర్గాల అభ్యున్నతికి మన ముఖ్యమంత్రి కెసిఆర్  అహర్నిషలు కృషి చేస్తున్నారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎన్‌టిఆర్ మినీ స్టేడియంలో రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. తొలుత జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసింగించారు. అత్యుతమ పథకాలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి పథంలో దూసూకుపోతుందని తెలిపారు. ఉద్యమ సారధియే తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కావడం మనందరి అదృష్టమని, అదే పోరాట స్పూర్తితో బంగారు తెలంగాణ సాధన దిశగా ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తున్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా రైతు బంధు పథకం, ఆసరా ఫించన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీమూభారక్, పేద విద్యార్థులకు రెసిడెన్సియల్ స్కూళ్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, కెజి టు పీజి ఉచిత విద్య, కెసిఆర్ కిట్, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌తో పాటు అనేక అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సబ్బండ వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నారని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవంతో కొత్తగా ఏర్పడ్డ నిర్మల్ జిల్లా అన్ని అభివృద్ది పథంలో ప్రయణిస్తుందని తెలిపారు. అలాగే నిర్మల్ జిల్లా అభివృద్ది పథంలో అగ్రభాగంలో నిలిపేందుకు జిల్లా ప్రజల సహాకారంతో అహర్నిషలు కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ యం.ప్రశాంతి, జిల్లా ఎస్పి శశిధర్‌రాజు, జిల్లా మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్‌ చక్రవర్తి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు వెంకట్‌రామ్‌రెడ్డి, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే అంతకముందు

Comments

comments

Related Stories: