అబ్బురపరిచే భారీ పోరాటాలు

kmal

నటన కోసం ఎలాంటి సాహసమైన చేయడానికి వెనుకాడని నటుల్లో కమల్‌హాసన్ ఒకరు. ఎలాంటి పాత్రల్లోనైనా ఇట్టే ఒదిగిపోగలరు కాబట్టి ఆయనకు విశ్వ నటుడు అనే బిరుదును కట్టబెట్టారు ప్రేక్షకులు. ఆ బిరుదుకు మరోసారి న్యాయం చేశారాయన. కమల్‌హాసన్ నటించిన చిత్రం ‘విశ్వరూపం-2’ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌లో మొత్తం హెవీ యాక్షన్ సన్నివేశాలే ఉన్నాయి. దీంతో ఈ సినిమాలో ప్రేక్షకులను అబ్బుపరిచే భారీ పోరాటాలు ఉన్నాయని తెలిసిపోయింది. ట్రైలర్ చూసిన వారంతా కమల్ ఆరు పదుల వయసులో కూడా ఒక పాత్రలో అన్ని వేరియేషన్స్ చూపడం, భారీ యాక్షన్ సన్నివేశాలు చేయడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. కమల్ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 10న విడుదలకానుంది. ఈ సందర్భంగా కమల్‌హాసన్ మాట్లాడుతూ “ఈ సినిమా మొదటి భాగం ‘విశ్వరూపం’కు ప్రీక్వెల్, సీక్వెల్‌లాంటిది. మొదటి పార్టు విడుదలకు వచ్చిన ఇబ్బందులు ఇప్పుడు తలెత్తవని ఆశిస్తున్నాను”అని చెప్పారు.

Comments

comments