అబద్ధాలు మాట్లాడడంలో గోబెల్స్‌ను మించిన జీవన్‌రెడ్డి

నియోజకవర్గ అభివృద్ధికి జీవన్ చేసింది శూన్యం పెద్దపెల్లి ఎంపి బాల్క సుమన్ జగిత్యాలటౌన్: ఒక అబద్దాన్ని పదే పదే మాట్లాడితే అదే నిజమవుతుందనే భ్రమతో జగి త్యాల ఎంఎల్‌ఎ జీవన్‌రెడ్డి మాట్లాడుతున్న అబద్దాలు గోబెల్స్‌ను మించిపోయాయని పెద్దపెల్లి ఎంపి బాల్క సుమన్ అన్నారు.శుక్రవారం టిఆర్‌ఎస్ కార్యాలయ ంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ ఎంఎల్‌ఎ జీవన్‌రెడ్డి రాష్ట్ర ప్రభు త్వంపై అనవసరపు విమర్శలు చేస్తూ ప్రజల్లో చులక నవుతున్నాడన్నారు.ఉస్మానియా యూనివర్సిటీ మెస్ బకాయిలు […]

నియోజకవర్గ అభివృద్ధికి జీవన్
చేసింది శూన్యం
పెద్దపెల్లి ఎంపి బాల్క సుమన్

జగిత్యాలటౌన్: ఒక అబద్దాన్ని పదే పదే మాట్లాడితే అదే నిజమవుతుందనే భ్రమతో జగి త్యాల ఎంఎల్‌ఎ జీవన్‌రెడ్డి మాట్లాడుతున్న అబద్దాలు గోబెల్స్‌ను మించిపోయాయని పెద్దపెల్లి ఎంపి బాల్క సుమన్ అన్నారు.శుక్రవారం టిఆర్‌ఎస్ కార్యాలయ ంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ ఎంఎల్‌ఎ జీవన్‌రెడ్డి రాష్ట్ర ప్రభు త్వంపై అనవసరపు విమర్శలు చేస్తూ ప్రజల్లో చులక నవుతున్నాడన్నారు.ఉస్మానియా యూనివర్సిటీ మెస్ బకాయిలు చెల్లించలేదని మాట్లాడిన జీవన్‌రెడ్డి తాను బకాయిలు చెల్లించిన జిఒను చూపించగానే మాట మార్చి కేవలం 42 శాతం మాత్రమే చెల్లించారని, మ రో అబద్ధం ఆడాడన్నారు. 2004-14 వరకు ఎంత బకాయిపడ్డాయో లెక్క చూసిన తర్వాతనే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ జిఒ విడుదల చేసిందని సు మన్ వివరించారు.మూడు దశాబ్ధాల రాజకీయ జీ వితంలో జీవన్‌రెడ్డి జగిత్యాల నియోజకవర్గానికి చే సింది శూన్యమని విమర్శించారు.

ఒకప్పుడు ఎంతో మంది రైతులకు ఉపయోగపడే చల్‌గల్ వ్యవసాయ క్షేత్రం మూతపడిందని, ఇరిగేషన్ హబ్‌గా ఉన్న జగి త్యాలలోని కార్యాలయాలు ఇతర ప్రాంతాలకు తర లివెళ్ళినా జీవన్‌రెడ్డి ఎందుకు పట్టించుకోలేదని విమ ర్శించారు.జీవన్‌రెడ్డి ఎదుగుదలకు జగిత్యాలను ఒక ఆట వస్తువుగా ఉపయోగించుకున్నాడని బాల్క సు మన్ మండిపడ్డారు.30ఏళ్లుగా జగిత్యాలలో మా స్టర్ ప్లాన్ లేదని, రోడ్లు వెడల్పు కాలేదని, టౌన్ హాల్, రైతు బజార్ నిరుపయోగంగా ఉన్నాయని, శాశ్వత మంచినీటి వ్యవస్థ ఇంత వరకు లేదని విమర్శించా రు.జగిత్యాల మున్సిపాల్టీలో జరుగుతున్న అవినీతి   విషయం ప్రజలందరికీ తెలిసిందేనన్నారు.

ఎంపి కవిత సహకారంతో జగిత్యాల నియోజకవర్గాన్ని అ న్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ము స్లిం రిజర్వేషన్ల గురించి జీవన్‌రెడ్డి విమర్శించడం త గదన్నారు. తాను ఎంపి పదవిని ప్రజా సేవకు వచ్చి న అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపారు. తాను కొ త్తగా రాజకీయంలోకి వచ్చానని, ఎంపి అయినా రెం డున్నర సంవత్సరాల్లో పెద్దపెల్లి నియోజకవర్గానికి చేసిన అభివృద్దిని, 30ఏళ్ల రాజకీయ జీవితంలో జీవ న్‌రెడ్డి జగిత్యాల నియోజకవర్గానికి చేసిన అభివృద్దిని ప్రజల ముందు చర్చించేందుకు సిద్దమని సుమన్ స వాల్ విసిరారు. పదేపదే అబద్ధ్దాలు మాట్లాడితే తా టిపర్తి జీవన్‌రెడ్డిగా కాకుండా “అబద్దాల జీవన్‌రెడ్డి” గా చరిత్రలో నిలిచిపోతాడని సుమన్ విమర్శించారు. ఇప్పటికైనా అనవసర విమర్శలు మాని నిర్మాణాత్మక మైన సూచనలు, సలహాలు ఇస్తే తమ ప్రభుత్వం స్వీ కరించేందుకు సిద్ధంగా ఉందని సుమన్ తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈ శ్వర్, ఎంఎల్‌సి నాదరాసు లక్ష్మణ్‌రావు, డాక్టర్ సం జయ్‌కుమార్, రామగుండం మేయర్ లక్ష్మీనారాయ ణ, చంద్రశేఖర్‌రావు, వెంకటేష్ యాదవ్, బాదినేని రాజేందర్, దేవేందర్ నాయక్, ద్యావ సురేష్, గట్టు సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: