అప్పుల బాధతో రైతు బలవన్మరణం

Farmer Commits Suicide at Adilabad

ఆదిలాబాద్ : బోథ్ మండలం కుచులపూర్ గ్రామంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధతో గొడిసెల సురేష్ అనే యువ రైతు పత్తి చేనులోనే పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పత్తి సాగు కోసం అప్పులు చేశాడని, అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆ గ్రామ ప్రజలు తెలిపారు. సురేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పోస్టుమార్టం కోసం సురేష్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Farmer Commits Suicide at Adilabad

Comments

comments