అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ఏన్కూరు: అప్పుల బాదతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని జన్నారం గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… ఆ గ్రామానికి చెందిన స్వర్ణ క్రిష్ణారావు (32) వ్యవసాయంలో కలిసిరాక అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న 3 ఎకరాల భూమితో పాటు మరో 5 ఎకరాలు కౌలు తీసుకొని గత 5 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాడు. గత ఏడాది దిగుబడి తగ్గి లక్షల్లో అప్పుల పాలైయ్యాడు. ఈ నేపధ్యంలో […]

ఏన్కూరు: అప్పుల బాదతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని జన్నారం గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… ఆ గ్రామానికి చెందిన స్వర్ణ క్రిష్ణారావు (32) వ్యవసాయంలో కలిసిరాక అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న 3 ఎకరాల భూమితో పాటు మరో 5 ఎకరాలు కౌలు తీసుకొని గత 5 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాడు. గత ఏడాది దిగుబడి తగ్గి లక్షల్లో అప్పుల పాలైయ్యాడు. ఈ నేపధ్యంలో భార్య తన ఇద్దరి పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లడంతో మనస్థాపానికి గురైన అతను ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి సీతారామయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ నాగరాజు ఘటన స్థలానికి వెళ్లి విచారించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related Stories: