అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య

జయశంకర్ భూపాలపల్లి: అప్పుల బాధ తాళలేక తోట సంతోష్(29) యువ రైతు దవాఖానలో చికిత్స పొందుతూ.. మృతి చెందిన ఘటన శుక్రవారం హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని శంకరాంపల్లి గ్రామానికి చెందిన సంతోష్ గత నాలుగు సంవత్సరాల క్రితం డిగ్రీ వరకు చదువు పూర్తి చేశాడు. ప్రభుత్వ ఉద్యోగం పక్కన పెడితే కనీసం ప్రైవేటు ఉద్యోగం కూడా లేకపోవడంతో వ్యవసాయ రంగంలోకి దిగ్గాడు. మూడేళ్లుగా తన […]

జయశంకర్ భూపాలపల్లి: అప్పుల బాధ తాళలేక తోట సంతోష్(29) యువ రైతు దవాఖానలో చికిత్స పొందుతూ.. మృతి చెందిన ఘటన శుక్రవారం హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని శంకరాంపల్లి గ్రామానికి చెందిన సంతోష్ గత నాలుగు సంవత్సరాల క్రితం డిగ్రీ వరకు చదువు పూర్తి చేశాడు. ప్రభుత్వ ఉద్యోగం పక్కన పెడితే కనీసం ప్రైవేటు ఉద్యోగం కూడా లేకపోవడంతో వ్యవసాయ రంగంలోకి దిగ్గాడు. మూడేళ్లుగా తన తండ్రి ఇచ్చిన 2ఎకరాల భూమికి తోడు మరో 2ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవాడు. మరో యేట తన అత్తగారి గ్రామం మహాదేవపూర్‌లో 5ఎకరాలు పత్తి, మిర్చి పంట వేసినట్లు తెలిపారు. నాలుగేళ్లుగా వ్యవసాయంలో పంట దిగుబడి రాకపోవంతో సుమారు రూ.10లక్షల వరకు అప్పు చిన్న తనంలోనే భారం మీద పడ్డింది. అప్పు ఇచ్చిన వారు నిత్యం డబ్బుల కోసం వేధించడం, ఇంట్లో ఆర్థిక పరస్థితులు బాగోలేక చివరికి జీవితంపై విరక్తి చెంది  పురుగుల మందు సేవించడాని చెప్పారు. అనంతరం కుటుంబ సభ్యులు సంతోష్ ను వరంగల్ ఎంజిఎంకు తరలించగా ఇక్కడి వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని తెలిచి చెప్పాడంతో అక్కడ నుండి హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పతికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడన్నారు. మృతునికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఆర్థికంగా వెనుకబడి అప్పుల పాలై ఉన్న సంతోష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరారు. కాటారం ఎఎస్ఐ రహూఫ్ హైదరాబాద్ గాంధీ ఆస్పతికి వెళ్లి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Comments

comments

Related Stories: