అప్పుల బాధతో ఆగిన రైతు గుండె…

Farmer Died With Heart Attack
మంచాలః కాలం కాక అప్పులు చేసి వేల కొద్ది పీట్లలోతు బోర్లు వేసిన చుక్క నీరు రాక పోవడంతో ఓ రైతు గుండె ఆగి మృతి చెందాడు. ఈ సంఘటన మంచాల మండల పరిధిలోని లోయపల్లి అనుబంద గ్రామం సత్తి తండాలో శనివారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. సత్తి తండాకు చెందిన కొర్ర లక్ష్మనాయక్(45) తనకు ఉన్న వ్యవసాయ పొలంలో నీళ్లు లేక పోవడంతో మూడు బోర్లు వేశాడు. వాటికి దాదాపు 3 లక్షల రూపాయలు ఖర్చు కావడంతో అందులో ఏ ఒక్క బోరులో చుక్క నీరు రాక పోవడంతో అప్పులు మిగిలాయనే ఆవేధన చెందాడు.  శనివారం సాయంత్రం తన వ్యవసాయ పోలంలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

Comments

comments