అపర భగీరథుడు హరీష్ రావు

మంత్రి హరీశ్‌రావును కొనియాడిన ప్రజలు సిద్దిపేట అభివృద్ధిని చూసి సంబుర పడ్డ స్థానికులు మన తెలంగాణ/సిద్దిపేట అర్బన్ : రంగనాయక్ సాగర్ ప్రాజెక్టును చూసిన సిద్దిపేట మున్సిపాలిటీ 14వ వార్డు ప్రజలు మంత్రి తన్నీరు హరీశ్‌రావు అపర భగిరథుడని కొనియాడారు. అందుకు మంత్రి స్పందిస్తూ పట్టణ అభివృద్ధికి ప్రజల సహకారం మరింత అవసరమన్నారు. పట్టణ ప్రజలు అభివృద్ధి పనుల పరిశీలనలో భాగంగా ఆదివారం నర్సాపుర్‌లో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇండ్లను వీక్షిస్తుండగా అక్కడికి వచ్చిన మంత్రి వార్డు […]

మంత్రి హరీశ్‌రావును కొనియాడిన ప్రజలు
సిద్దిపేట అభివృద్ధిని చూసి సంబుర పడ్డ స్థానికులు

మన తెలంగాణ/సిద్దిపేట అర్బన్ : రంగనాయక్ సాగర్ ప్రాజెక్టును చూసిన సిద్దిపేట మున్సిపాలిటీ 14వ వార్డు ప్రజలు మంత్రి తన్నీరు హరీశ్‌రావు అపర భగిరథుడని కొనియాడారు. అందుకు మంత్రి స్పందిస్తూ పట్టణ అభివృద్ధికి ప్రజల సహకారం మరింత అవసరమన్నారు. పట్టణ ప్రజలు అభివృద్ధి పనుల పరిశీలనలో భాగంగా ఆదివారం నర్సాపుర్‌లో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇండ్లను వీక్షిస్తుండగా అక్కడికి వచ్చిన మంత్రి వార్డు ప్రజలతో ముచ్చటించారు. అంతకు ముందు టిఆర్‌ఎస్ నాయకుడు కొండం సంతప్‌రెడ్డి ఆధ్వర్యం లో సిద్దిపేటలో జరుగుతున్న అభివృద్ధి పనులను 14వ వార్డు ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించారు.

రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులను చూసి వారు సంబుర పడ్డారు. ప్రాజెక్టును చూస్తుంటే మంత్రి హరీశ్‌రావు శ్రమ ఎనలేనిదని కొనియాడారు. ఇంత గొప్ప ప్రాజెక్టు నిర్మించాలంటే నిరంతర కృషి , పట్టుదల కావాలన్నారు. ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే ఇలాంటి ప్రాజెక్టులు అవసరమన్నారు. అదే విధంగా పట్టణంలో నర్సాపూర్ వద్ద నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇండ్లను, మందపల్లి డంప్ యార్డు, వైకుంఠధామాలు, స్మృతి వనం, మెడికల్ కళాశాలల నిర్మాణం, కోమటిచెరువు సుందరీకరణ, ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియం, సిమ్మింగ్‌పూల్, ఆడిటోరియం తదితర అభివృద్ధి పనులను చూసిన వార్డు ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ నెల 6, 7, 8 తేదీల్లో జరగనున్న పెద్దమ్మ బోనాల పండుగకు సంబంధించిన గోడ పత్రికను మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆవిష్కరించారు.

నెలాఖారున సిద్దిపేటలో ‘డబుల్’ గృహ ప్రవేశాలు

సిద్దిపేటలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇండ్ల గృహ ప్రవేశాలను ఈ నెలా ఖరులో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా చేయిస్తామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట పట్టణం లోని సమీకృత మార్కెట్, చింతల చెరువు, ఎస్‌టిపి పనులు, మున్సిపల్ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇండ్లను ఆదివారం మంత్రి పరిశీలిం చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం 1960 డబుల్ బెడ్ రూంలు సిద్ధంగా ఉన్నాయని, మరో 500 ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. ఈ గ్రేటర్ కమ్యూనిటీకి 24 గంటల విద్యుత్, తాగునీరు సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకొవాలని ఆర్‌డబ్లూఎస్ శాఖ ఎస్‌ఈ చక్రవర్తి, విద్యుత్ శాఖ ఎస్‌ఈ కర్ణాకర్‌బాబులను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకట్రామారెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి వివిధ శాఖ అధికారులతో సమన్వయం పరిచి 15 రోజుల్లోగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. డబుల్ బెడ్‌రూం కాలనీకి ప్రత్యేక సబ్‌స్టేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాలనీలోని ప్రతి ఇంటికి విద్యుత్ మీటర్ల బిగింపు పూర్తి చేయాలని, ఇందుకోసం ప్రతి ఇంటికి రూ.130ల డిడి కట్టి విద్యుత్ పోల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.

Comments

comments

Related Stories: