అన్ని రాష్ట్రాలకు వాజ్‌పేయీ అస్థికలు

అస్థి కలశ్ యాత్ర పేరుతో దేశవ్యాప్త ఊరేగింపులు, కలశాలతో హైదరాబాద్‌కు రాష్ట్ర నేతలు, నేడు బాసర వద్ద గోదావరిలో నిమజ్జనం మన తెలంగాణ / న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా బుధవారం నాడు వాజ్‌పేయీ అస్థికల కలశాలను రాష్ట్రాల బిజెపి అధ్యక్షులకు అందజేశారు. దేశవ్యాప్తంగా ఈ అస్థికలను నిమజ్జనం చేయాలని వారు అధ్యక్షులకు సూచించారు. ఈ అస్థికలతో ఆయా రాష్ట్రాల అధ్యక్షుడు అస్థి కలశాల యాత్రని నిర్వహించాలని తెలిపారు. బిజెపి […]

అస్థి కలశ్ యాత్ర పేరుతో దేశవ్యాప్త ఊరేగింపులు, కలశాలతో హైదరాబాద్‌కు రాష్ట్ర నేతలు, నేడు బాసర వద్ద గోదావరిలో నిమజ్జనం

మన తెలంగాణ / న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా బుధవారం నాడు వాజ్‌పేయీ అస్థికల కలశాలను రాష్ట్రాల బిజెపి అధ్యక్షులకు అందజేశారు. దేశవ్యాప్తంగా ఈ అస్థికలను నిమజ్జనం చేయాలని వారు అధ్యక్షులకు సూచించారు. ఈ అస్థికలతో ఆయా రాష్ట్రాల అధ్యక్షుడు అస్థి కలశాల యాత్రని నిర్వహించాలని తెలిపారు. బిజెపి అత్యున్నత నేత వాజ్‌పేయీ గొప్పదనాన్ని దేశవ్యాప్తంగా చాటడానికి ఈ యాత్ర చేపట్టాలని కోరారు. అస్థికల కలశాలను రాష్ట్రాల బిజెపి అధ్యక్షులకు అందజేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ పాల్గొన్నారు. మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయీ అస్థికలను దేశంలోని 100 నదుల్లో ఊరేగింపుగా వెళ్లి కలపాలని, దారి పొడుగునా ప్రజలు దివంగత నేతకు నివాళులర్పిస్తారని అమిత్ షా చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వాజ్‌పేయీ అస్థికలతో యాత్ర నిర్వహించాలని బిజెపి నిర్ణయించింది. ఢిల్లీ నుంచి ప్రారంభమయ్యే అస్థి కలశ్ యాత్ర అన్ని బ్లాకుల నుంచి సాగుతుందని ఆయన చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలతోపాటు బ్లాకు స్థాయిల్లోనూ ఈ యాత్ర చేపట్టాలని బిజెపి నేత అమిత్ షా చెప్పారు. వాజ్‌పేయీ స్మారకార్థం చత్తీస్‌గఢ్ ఇప్పటికే ఓ నగరానికి ఆయన పేరు పెట్టింది. మహారాష్ట్రలోని కొన్ని యూనివర్శిటీలు ఆయన పేరుపెట్టాలని నిర్ణయించాయని ఆయ న తెలిపారు.
అస్థికలతో హైదరాబాద్‌కు రాష్ట్ర నేతలు
భారతరత్న, దివంగత ప్రధాన మంత్రి అటల్ బిహారి వాజ్‌పేయీ అస్థికలను గురువారం ఉదయం వరకు హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ప్రజల దర్శనార్ధం ఉంచుతామని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. వాజ్‌పేయీ అస్థికల కలశాలను ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా చేతుల మీదుగా పంపిణీ చేశారని, హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి పార్టీ కార్యాలయం వరకు ఊరేగింపుగా తీసుకెళ్తామని లక్ష్మణ్ చెప్పారు.
“వాజ్‌పేయీ అస్థికలను బాసరలో పార్టీ నేతలు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి కలుపుతారు. మురళీధర్‌రావు, నేను పవిత్ర సంగమంలో కలుపుతాం” అని తెలిపారు. వివిధ జిల్లాల్లో నివాళులు అర్పించేందుకు అస్థికలను ఉంచుతామని లక్ష్మణ్ తెలిపారు. వాజ్‌పేయీ స్ఫూర్తిగా 2019లో అధికారంలోకి వస్తామని లక్ష్మణ్ చెప్పారు.

Comments

comments