అనూష గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది అరెస్టు

మన తెలంగాణ / హైదరాబాద్/ఉస్మానియా యూనివర్సిటీ: ప్రేమకు, పెళ్ళికి నిరాకరించిందనే నెపంతో అనూష గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది ఆరేపల్లి వెంకట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు ఓ.యూ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఈస్ట్‌జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎం.రమేశ్, కాచిగూడ ఎసిసి నర్సయ్య, ఓ.యూ ఇన్‌స్పెక్టర్ జి.జగన్‌లు అనూష హత్య ఘటనపై వివరాలు వెల్లడించారు. పార్శిగుట్టలో నివాసముంటున్న వ్యాపారి దుర్గం సూర్యప్రకాశ్ ఫిర్యాదు మేరకు ప్రేమోన్మాది ఆరెపల్లి వెంకట్‌పై హత్యకేసుగా నమోదు చేసుకుని పూర్తిగా దర్యాప్తు […]

మన తెలంగాణ / హైదరాబాద్/ఉస్మానియా యూనివర్సిటీ: ప్రేమకు, పెళ్ళికి నిరాకరించిందనే నెపంతో అనూష గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది ఆరేపల్లి వెంకట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు ఓ.యూ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఈస్ట్‌జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎం.రమేశ్, కాచిగూడ ఎసిసి నర్సయ్య, ఓ.యూ ఇన్‌స్పెక్టర్ జి.జగన్‌లు అనూష హత్య ఘటనపై వివరాలు వెల్లడించారు. పార్శిగుట్టలో నివాసముంటున్న వ్యాపారి దుర్గం సూర్యప్రకాశ్ ఫిర్యాదు మేరకు ప్రేమోన్మాది ఆరెపల్లి వెంకట్‌పై హత్యకేసుగా నమోదు చేసుకుని పూర్తిగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. పార్శిగుట్టలో నివాసముంటున్న ఆరేపల్లి  రవిందర్ కుమారుడు ఆరేపల్లి వెంకట్ అలియాస్ చింటు (19) నారాయణగూడలోని న్యూ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కాగా మృతురాలు అనూష (16)తో వెంకట్‌కు గత రెండు సంవత్సరాల క్రితం నుంచి స్నేహం కొనసాగుతోంది.

అయితే వెంకట్ ప్రవర్తన సరిగాలేదని మరో మహిళతో మాట్లాడుతున్నాడనే కారణంతో  గత నెల రోజుల క్రితం నుంచి వెంకట్‌తో కమ్యూనికేషన్‌ను అనూష కొనసాగించడంలేదు. ఈ నేఫథ్యంలో అనూషతో మాట్లాడటానికి వెంకట్  పలుమార్లు ప్రయత్నించాడు అలాగే ఫోన్ కూడా ఆమెకు చేసినప్పటికీ వెంకట్  కాల్స్‌ను అనూష రిజెక్టు చేసింది. దీంతో అనూషను అంతమొందించాలని వెంకట్ పథకం పన్నాడు.  అనూష స్నేహతురాలు   ద్వారా అనూషను జామై ఉస్మానియా రోడ్డులోని  (ఆర్ట్ కాలేజి రైల్వేస్టేషన్ సమీపంలో)పాడుబడ్డ పోలీస్ క్వార్టర్స్ వద్దకు మంగళవారం రాత్రి రప్పించాడు. తర్వాత వెంకట్ అక్కడికి చేరుకున్నాడు.

ఇక్కడ అనూషతో వెంకట్ మాట్లాడుతూ నన్ను ప్రేమించకుండా  ఎందుకు దూరంపెడుతున్నావ్ అని ప్రశ్నించడంతోపాటు  తనను పెళ్ళిచేసుకోవాలని అడిగాడు. ఇందుకు అనూష తిరస్కరించింది. దీంతో వెంటనే  వెంకట్  తన జేబులో నుంచి బ్లేడ్‌ను తీసి  అనూష గొంతు కోశాడు. ఆ వెంటనే అనూష బాడీని అక్కడి గదిలోకి చేర్చుతూ పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే  అక్కడే ఉన్న స్థానికులు వెంకట్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వెంకట్‌ను అదుపులోకి తీసుకుని ఓ.యూ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Comments

comments

Related Stories: