అనుమానాస్పదస్థితి లో వివాహిత మృతి…

Married Women dead in suspicion in Komaram Bheem Jilla

కుమ్రం భీం ఆసిఫాబాద్: సకినాల పావని అనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన  జిల్లాలోని దహేగాం మండలంలోని బిబ్రా గ్రామంలో విషాదం చోటు చేసుకున్నది. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే.. గత కొంత కాలంగా తన అత్తింటివారు వరకట్నం కోసం వేధిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మృతురాలి బంధువుల మేరకు అత్తింటి వారిపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. పావని అత్తింటి వారిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.