అనుమానాస్పదస్థితిలో హోంగార్డు మృతి

పెద్దపల్లి : అనుమానాస్పదస్థితిలో ఓ హోంగార్డు చనిపోయాడు. ఈ ఘటన గోదావరిఖని సమీపంలోని గోదావరి ఒడ్డున చోటు చేసుకుంది. తిరుపతి అనే యువకుడు గోదావరిఖనిలో హోంగార్డుగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన తిరుపతి గోదావరి నది సమీపంలోని ఫిల్టర్ బెడ్ వద్ద మృతి చెంది కనిపించాడు. తిరుపతి స్వస్థలం భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామెరకుంట పరిధిలోని లక్ష్మీపురం. తిరుపతి ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ప్రమాదవశాత్తు ఫిల్టర్ బెడ్‌లో […]

పెద్దపల్లి : అనుమానాస్పదస్థితిలో ఓ హోంగార్డు చనిపోయాడు. ఈ ఘటన గోదావరిఖని సమీపంలోని గోదావరి ఒడ్డున చోటు చేసుకుంది. తిరుపతి అనే యువకుడు గోదావరిఖనిలో హోంగార్డుగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన తిరుపతి గోదావరి నది సమీపంలోని ఫిల్టర్ బెడ్ వద్ద మృతి చెంది కనిపించాడు. తిరుపతి స్వస్థలం భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామెరకుంట పరిధిలోని లక్ష్మీపురం. తిరుపతి ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ప్రమాదవశాత్తు ఫిల్టర్ బెడ్‌లో పడి చనిపోయాడా ? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Homeguard Suspicion Death in Godavarikhani

Related Stories: