అనుమానస్పద స్థితిలో యువతి మృతి

Young Girl Dies Suspected In medchal District

 ఘట్‌కేసర్: అనుమానస్పద స్థితిలో ఓ యువతి రైలు పట్టాల పక్కన శవమై పడి ఉన్న సంఘటన ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం తెల్లవారు జామున జరిగింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పోచారం పంచాయతీ అన్నోజిగూడ రాజీవ్ గృహకల్ప కాలనీలో నివాసం ఉంటున్న జంపాల ఆశోక్, విజయల కూతురు కావేరి(19) ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాల పక్కన శనివారం తెల్లవారు జామున శవమై కనిపించినట్లు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమచారం మేరకు శవాన్ని పంచనామ జరిపి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతురాలు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుందా, లేక ఎవరైన రైలు కిందకు నెట్టారా, అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. ఎక్కడైన హత్య చేసి రైలు పట్టాల పక్కన పడవేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ విఫలమై ఆత్మహత్య పాల్పడిందా, లేక ప్రియుడే హత్య చేశాడా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. హత్యా, ఆత్మహత్యా పోస్టుమార్టం అనంతరం మిస్టరీ వీడుతుందని పోలీసులు తెలిపారు. మృతురాలి కాల్‌డేటా ఆధారంగా రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందని తరుణ్, జాన్సన్ అనే ఇద్దరు యువకుల నెంబర్ల నుండి శుక్రవారం రాత్రి మాట్లాడినట్లు తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ మార్చురికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్త జరుపుతున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

Comments

comments