అనుమానస్పదస్థితిలో వ్యక్తి మృతి …

Man  Suspected Dies in Ranga Reddy District

ఇబ్రహీంపట్నం : అనుమానస్పదస్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం నగర పంచాయితీకి చెందిన జెట్టి యాదయ్య (45) నగర పంచాయితీ కార్మీకుడిగా పని చేసేవారు. ఆయనకు కుమారుడు, కూతురు ఉన్నారు. ఈమద్య కాలంలో అతని నగర పంచాయతీ కార్మీకునిగా విధుల నుండి తీసి వేయడంతో ఈ రోజు ఉదయం కూలీ పని కోసం వెళ్ళి రాయపోల్ రోడ్డు హెచ్ పేస్ సమీపంలో అనుమానస్పదస్థితిలో మృతి చెందారు. స్థానికులు సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతిని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments