అనారోగ్యంతో ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

మన తెలంగాణ/తాండూరు రూరల్‌ః అనారోగ్యంతో ఓ వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తాండూరు మండల కోట్‌బస్పల్లిలో మంగళవారం జరిగింది. కరణ్‌కోట్ ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వడ్డే వెంకటయ్య(60) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని మంగళవారం జిన్‌గుర్తి గ్రామ సమీపంలో ఉన్న సోలార్ పవర్ ప్లాంట్ పక్కన ఉన్న గుండ్ల వాగు సమీపంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుని కొడుకు ఫిర్యాదు మేరకు […]


మన తెలంగాణ/తాండూరు రూరల్‌ః అనారోగ్యంతో ఓ వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తాండూరు మండల కోట్‌బస్పల్లిలో మంగళవారం జరిగింది. కరణ్‌కోట్ ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వడ్డే వెంకటయ్య(60) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని మంగళవారం జిన్‌గుర్తి గ్రామ సమీపంలో ఉన్న సోలార్ పవర్ ప్లాంట్ పక్కన ఉన్న గుండ్ల వాగు సమీపంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుని కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Comments

comments

Related Stories: