అధ్వానం ‘ఆర్టీసీ’ ప్రాంగణం

మన తెలంగాణ/ సూర్యాపేట సిటి : జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ప్రాంగణం గుంతలమయంగా మారింది. డిపో గ్యారేజి నుంచి బస్టాండ్‌లోకి బస్సులు వచ్చే రహాదారి మొత్తం ఆధ్వానంగా ఉండటంతో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా కాలంగా ఈ ప్రాంతంలో గుంతలు పడి ఉన్న అధికారులు పట్టించుకోకపోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి రోజు వందలాది బస్సులు ఈ రహదారిలో రాకపోకలు సాగిస్తుండటంతో రోడ్డు గుంతలు పడి బస్సులు మరమ్మతులకు గురవుతున్నాయి. బస్సులు బస్టాండ్‌లోని డిపోకు […]


మన తెలంగాణ/ సూర్యాపేట సిటి : జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ప్రాంగణం గుంతలమయంగా మారింది. డిపో గ్యారేజి నుంచి బస్టాండ్‌లోకి బస్సులు వచ్చే రహాదారి మొత్తం ఆధ్వానంగా ఉండటంతో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా కాలంగా ఈ ప్రాంతంలో గుంతలు పడి ఉన్న అధికారులు పట్టించుకోకపోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి రోజు వందలాది బస్సులు ఈ రహదారిలో రాకపోకలు సాగిస్తుండటంతో రోడ్డు గుంతలు పడి బస్సులు మరమ్మతులకు గురవుతున్నాయి. బస్సులు బస్టాండ్‌లోని డిపోకు వెళ్లే దారి అస్తవ్యస్తంగా తయారు అయింది. డిపో గేటు నుం డి బస్సులు నేరుగా కుడకుడ రోడ్డు మీదకు వచ్చి బస్టాండ్‌లోకి వ స్తుంటాయి. అయితే ప్రయాణికుల ప్రాంగణానికి సరిగా వెనుక వైపు ఉండే ఈ ప్రాంత లోతట్టుగా ఉండటంతో వర్షంపు నీరు చేరి అధ్వానంగా ఉంటుంది. కాగా రెండు సంవత్సరాల క్రితం కుడకుడ రోడ్డు నుండి కొంతమేర సిసిరోడ్డు వేశారు. ఈ రోడ్డును నేరుగా డిపో గేటు వద్దకు వెయాల్సి ఉన్న సుమారు 60 మీటర్ల మేరకు వేసి అస ంతృప్తిగా వదిలేశారు. అలాగే డిపో గేటు నుండి జాతీయ రహదారిపైకి వెళ్లే ప్రాంతంలోను సిసిరోడ్డు సగంలోనే నిలిపివేశారు. అసంపూర్తిగా వదిలేసిన సిసిరోడ్డు గుంతలమయంగా మారింది. దీనికి తోడు గతంలో వేసిన కంకర తేలి గుంతలుగా మారింది. దీంతో బస్సులు చీటికి మాటికి మరమ్మతులకు గురవుతున్నాయి.
బస్సు పాసు కౌంటర్ దగ్గర వర్షపు నీరు దోమలతో ఇబ్బందులు ప డుతున్నామని విద్యార్ధులు వాపోతున్నారు. గుంతలను పూడిచి మురు గునీరు చేరకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్ధులు కోరుతున్నారు. కనీసం వర్షపునీరు చేరిన దగ్గర బ్లీచింగ్ ఫోడర్ వే యకుండా నిర్లక్షం వహిస్తున్నారన్నారు. ఇప్పటికైన అదికారులు స్పం దించి బస్టాండ్ అవరణంలో ఉన్న రోడ్లను మరమ్మతులు చేయా లని కోరుతున్నారు. ప్రయాణికులు సైతం ఈ రోడ్డు గుండా వెళ్లేం దుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే డిపో గేటు వరకు సిసిరోడ్డు నిర్మించాలని డ్రైవర్లులతో పాటు ప్రయాణికులు దారుమని వాపోతున్నారు. ఇప్పటికైన అధికారుల స్పందించి గుంతలమయంగా ఉన్న రోడ్డును సిసిరోడ్డు నిర్మించాలని కోరుతున్నారు.
డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు.
కొత్త బస్టాండ్ ప్రాంగణం గుంతలమ యంగా మారింది. డిపోలోకి బస్సులు వె ళ్లేటప్పుడు గుంతల కారణంగా కుదుపున కు గురవుతు న్నాయి. ప్ర యాణికులతో పాటు డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు.
ఈ ప్రాంతంలో సిసిరోడ్డు నిర్మించాలి.
ఉపేందర్ కండక్టర్
గుంతలను పూడిచి మరమ్మతులు చేయించండి
ప్రయాణం చేయాలంటేనే ఒళ్లు జంకుతోంది. రోడ్లన్నీ గుంతల మయంగా మారి బస్సు లలో, ఆటోలలో ప్రయాణం చేయడం ఇబ్బం దులకు గురి కావాల్సి వస్తుంది. సూర్యాపేట నుండి నేరేడుచర్ల వరకు వెళ్తున్నాడు. ఆయనను వివరణ కోరగా బస్సులు బస్టాండ్‌లోకి పోయ్యే టప్పుడు గుంతలో బస్సు కుదిపేయడంతో ఒల్లు గుల్లవు తుంది. ఇప్పటికైన ఆర్టీసీ సార్లు గుంతలను పూడిచి మరమ్మతులు చేసి ప్రయాణికుల ఇబ్బందులను తోలిగించాలి.
పి. ముత్యాలు ప్రయాణికుడు

Related Stories: