అధిక ఫీజుల పై విద్యార్థుల ఆందోళన

 Student concern over high fees in medchal dist

మన తెలంగాణ / ఘట్‌కేసర్ ః ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేసి పేదవిద్యార్థుల నడి విరుస్తున్నట్లు విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, ఫెరేన్స్ కమిటీ నాయకులు ఆరోపించారు. ఘట్‌కేసర్ మండల పరిధిలోని యంనంపేట్ గ్రామంలోని శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల ఇంజనీరింగ్ మొదటి, ద్వితియ, త్రుతియ సంవత్సరం విద్యార్థులు ఫెరేన్స్ కమిటి సంఘం నాయకులు, విద్యార్థి సంఘాలు ఎఐఎస్‌ఎఫ్, ఎస్.ఎఫ్.ఐ, ఎబీవీపీ, జె.ఎస్.పి, తల్లిదండ్రులు, శుక్రవారం యంనంపేట్ గ్రామంలోని రైల్వేప్లై ఓవర్, కళాశాల వద్ద ఆందోళన చేశారు. శ్రీనిధి కళాశాల యాజమాన్యం విద్యార్థుల వద్ద నుండి అక్రమంగా డబ్బులు లాగుతుందని, ప్రభుత్వం దృష్టికి తీసుకువెల్లినా, దున్నపోతుపై వర్షం కురిన చందంగా మారిందని ఆరోపించారు. కార్పోరేట్ కళాశాలలకు ప్రభుత్వాలు కొమ్ముకాస్తు, పేద విద్యార్థుల నడ్డి విరుస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఘాటుగా విమర్శించారు. సంవత్సరానికి లక్షల్లో ఫీజులు చెల్లిస్తు పేదలు నీలువుదోపిడీకి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమంగా కళాశాల యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం విద్యా సంవత్సరానికి రూ.97 వేలు తీసుకోవాలని తెలపగా, కళాశాల యాజమాన్యం రూ.1.37 వేలు వసూలు చేస్తున్నట్లు తెలిపారు.

బస్సు ఫీజులో గత సంవత్సరంను పోల్చుకుంటే 60 శాతం అధికంగా ఫీజు వసూలు చేస్తున్నట్లు వివరించారు. డబ్బులు చెల్లించకుంటే పరీక్షలకు పంపించమని విద్యార్థులను వేదింపులకు గురిచేస్తున్నట్లు వారు ఆరోపించారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న కళాశాల పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కళాశాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోవకుండా సీఐ రఘువీర్‌రెడ్డి ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థి సంఘాల నాయకులతో, ఫెరెన్స్ కమిటీ నాయకులతో మాట్లాడిన కళాశాల డైరక్టర్ 15 రోజుల సమయం కావాలని, చైర్మన్ అందుబాటులో లేరని వారిని కోరారు. దీంతో కళాశాల వద్ద ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో ఎబీవీపీ రాష్ట్ర నాయకులు పల్లా జిత్తెందర్‌రెడ్డి, ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఆర్యన్ శంకర్, శివారెడ్డి, శివా, లక్ష్మణ్, ఎస్.ఎఫ్.ఐ జిల్లా నాయకులు సంతోష్, శంకర్, కళ్లెం శ్రీకాంత్‌రెడ్డి, జె.ఎస్.పి నాయకులు, ఫెరెన్స్ కమిటీ అధ్యక్షులు జి.శ్రీనివాస్, ప్రధానకార్యదర్శి ప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు.
కళాశాల డైరక్టర్ నర్సింహ్మరెడ్డి మాట్లాడుతూ : కళాశాల యాజమాన్యం ఆదేశాల ప్రకారం తాము విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జరుగుతున్న సమస్యను యాజమాన్యం దృష్టికి తీసుకువెల్లగా, చైర్మన్ అందుబాటులో లేనందునా 15 రోజులు సమయం పడుతుందని అన్నారు. విద్యార్థులు సహనంతో ఉండాలని అన్నారు. అప్పటి వరకు విద్యార్థుల వద్ద ఎలాంటి రూపాయలు వసూలు చేయమని హమీ ఇచ్చారు. విద్యార్థులు అధిక ఫీజులు అనితెలుపున్నది వాస్తవం కాదని, కళాశాలలో మౌళిక వసతులు కల్పనలో ఎక్కువకర్చు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చెల్లించే రూ. 97 వేలు సరిపోవడం లేదని, రూ. 137 వేలు కావాలని కళాశాల కోర్టు ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. కోర్టు విద్యార్థులకు బ్యాంక్ గ్యారెట్ కింద 20 వేలు, కళాశాలకు 20 వేలు చెల్లించాలని తెలినట్లు పేర్కొన్నారు. మొత్తం రూ. 1.37 వేలు గా ఫీజులు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఆందోళన కారులు అర్ధం చేసుకోవాలని కోరారు.

Comments

comments