అధికారుల గైర్హాజరుపై గరం గరం

కోరం లేక వ్యవసాయ స్థాయి సంఘం సమావేశం వాయిదా మిగిలిన స్థాయి సంఘ సమావేశాలు మొక్కు బడిగానే మనతెలంగాణ/కరీంనగర్‌: స్థాయి సంఘ సమావేశాలకు అధికారుల గైర్హాజరుపై జిల్లా ప్రజాపరిషత్ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశాలకు తాము హాజరుకాకపోవడానికి గల కారణాలు తెలపకుండా, ఏజెండా అంశాలపై నోట్ పంపకుండా నిర్లక్ష వైఖరి అవలంబిస్తున్న అధికారులకు మెమోలు జారీ చేయాలని సభ్యులు డిమాండ్ చేశారు. స్థానిక జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం చైర్ పర్సన్ తుల […]

కోరం లేక వ్యవసాయ స్థాయి సంఘం సమావేశం వాయిదా
మిగిలిన స్థాయి సంఘ సమావేశాలు మొక్కు బడిగానే

మనతెలంగాణ/కరీంనగర్‌: స్థాయి సంఘ సమావేశాలకు అధికారుల గైర్హాజరుపై జిల్లా ప్రజాపరిషత్ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశాలకు తాము హాజరుకాకపోవడానికి గల కారణాలు తెలపకుండా, ఏజెండా అంశాలపై నోట్ పంపకుండా నిర్లక్ష వైఖరి అవలంబిస్తున్న అధికారులకు మెమోలు జారీ చేయాలని సభ్యులు డిమాండ్ చేశారు. స్థానిక జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం చైర్ పర్సన్ తుల ఉమ అధ్యక్షతన ఆర్థిక, గ్రామీణాభివృద్ధి, పనులు, విద్య, వైద్యం, ఆరోగ్యం, రామగుండం జడ్‌పిటిసి కందుల సంధ్యారాణి అధ్యక్షతన స్త్రీ శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమ స్థాయి సంఘ సమావేశాలు జరిగాయి. జడ్‌పి ఉపాధ్యక్షుడు రాయిరెడ్డి రాజిరె డ్డి అధ్యక్షతన తొలుత జరగాల్సిన వ్యవసాయ స్థాయి సంఘ సమావేశం సభ్యులు లేనికారణంగా వాయిదా పడింది. వ్యవసాయ స్థాయి సంఘ సమావేశానికి 12 మంది జడ్ పిటిసి సభ్యులు హాజరుకావాల్సి ఉండగా కేవలం ధర్మారం జడ్‌పిటిసి సభ్యుడు నార బ్ర హ్మయ్య మాత్రమే హాజరుకావడంతో కోరం లేక ఈ సమావేశం వాయిదా వేయాల్సి వ చ్చింది.

ప్రజా సమస్యలపై చర్చించాల్సిన స్థాయి సంఘ సమావేశాలు, సర్వసభ్య సమావేశానికి వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరుకాకపోవడం సమంజసం కాదని, దీ నిపై వారిని వివరణ కోరాలని సభ్యులు చైర్ పర్సన్‌కు సూచించారు.పెద్దపల్లి ప్రభుత్వ వైద్యశాలలో సిబ్బంది నిర్లక్షం కారణంగా బోంపల్లి రజిత అనే గర్భిణీ ప్రాణపాయ స్థితికి చేరుకున్న ఘటనపై జడ్‌పిటిసి సభ్యులతో విచారణ కమిటీ వేయాలని సమావేశం తీర్మానించింది. ఈ వైద్యశాలలో గైనిక్ లేని కారణంగా కాన్పుకోసం వచ్చిన రజితకు నర్సు ఆపరేషన్ చేయడంతో యూరినరీ ట్యూబ్ తెగిపోయి ఆమె ప్రాణపాయ స్థితికి చేరుకున్న విషయాన్ని జడ్ పిటిసి యాట దివ్య ప్రస్తావించారు. దీంతో సద రు మహిళ కుటుంబం కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ ఆసుపత్రుల చుట్టు తిరిగి రెండున్నర లక్షలు ఖర్చు చేసుకున్నప్పటికీ ఆరోగ్యం కుదుట పడలేదని చెప్పారు. ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డి మాండ్ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మిషన్ భగీరథ పనులపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు.అనేక పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ వాటి కి మరమ్మత్తులు చేపట్టడంలేదని సభ్యులు చైర్ పర్సన్ దృష్టికి తెచ్చారు.గోదావరిఖని లోని ఆదరణ అనాథ ఆశ్రమంలో ఇటీవల మైనర్ బాలికపై అకృత్యం జరిగిన విషయాన్ని శిశు సంక్షే మ స్థాయి సంఘ చైర్మన్ సంధ్యారాణి ప్రస్తావించారు. అనాధలను అక్కున చేర్చుకోవాల్సిన వారే అకృత్యాలకు పాల్పడడం విచారకరమన్నారు. ఈ అనాథ శరణలయం అనుమతుల ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనాధ ఆశ్రమాల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చే ము ందు వసతులు, నిర్వాహకుల నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకోవాలని, శరణాలయాలను అ ధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని డి మాండ్ చేశారు.

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, పిల్లలకు పాల సరఫరా విషయమై గతంలో జరిగిన స్థాయి సంఘ సమావేశంలో చర్చించినప్పటికీ, సరఫరా విషయంలో పురోగతి లేకుండా పోయిందని మల్యాల జడ్పీటీసీ శోభరాణి చెప్పారు.మల్యాల ఐసిడిఎస్ ప్రాజె క్టు పరిధిలోని కేంద్రాలకు గత 15 రోజులుగా పాల సరఫరా లేకుండా పోయిందన్నారు. పాల సరఫరా పై అధికారులు స్పష్టత ఇవ్వకపోతే జడ్పీ సర్వసభ్య సమావేశంలో వారిని నిలదీస్తానని, పోడియం ముందు బైఠాయించి ఆందోలన చేపడుతానని ఆమె హెచ్చరించారు. కాలపరిమితి ముగిసిన పాలు, నాణ్యత లోపించిన కోడి గ్రుడ్లు పంపిణీ చేస్తే గర్బిణీలు, పిల్లలు ఏ లా తింటారని, వారి ఆరోగ్యాల మాటేమిటని సంధ్యారాణి అధికారులను ప్రశ్నించారు. నాసిరకం వస్తువులను ఏజెన్సీలు పంపిణీ చేస్తే తిప్పి పంపాలని ఎన్ని సార్లు చెప్పినా అధికారుల పద్దతిలో మార్పు రావడంలేదన్నారు. మల్యాల మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణకు కేవలం ఒకే ఒక సూపర్‌వైజర్ ఉండగా ఆమెకు గ్రామపంచాయతీ ప్రత్యేకాధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించడంతో ఇక ఆ మె ఎక్కడ పనిచేస్తుందని జడ్‌పిటిసి శోభరాణి నిలదీశారు.
శిశు సంక్షేమాధికారులను పంచాయతీ ప్రత్యేకాధికారుల బాధ్యతలనుండి తప్పించాలని కోరారు. స్వచ్చ సర్వేక్షణ్ కార్యక్రమం ఎ క్కడ నడుస్తుందని ఆమె అధికారులను నిలదీశారు. మల్యాలలో 12అంగన్‌వాడీ కేంద్రాల కు అడ్రస్ లేకుండా పోగా ఇక స్వచ్చత ఎక్క డ… సర్వేక్షణ్ ఎక్కడ అని ప్రశ్నించారు.

Related Stories: